Hyderabad: అదనపు అంతస్తులు సీజ్.. వారానికే యథాతథంగా పనులు
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:38 AM
గాజులరామారం డివిజన్(Gajularamaram Division)లోని మహాదేవపురం కాలనీలో అక్రమ అం తస్తులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మహాదేవపురం, డీ-బ్లాక్, సీ-బ్లాక్‌లో ఇష్టారాజ్యంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు.
- పూర్తి అవుతున్న భవనాలు
- పట్టించుకోని అధికారులు
హైదరాబాద్: గాజులరామారం డివిజన్(Gajularamaram Division)లోని మహాదేవపురం కాలనీలో అక్రమ అం తస్తులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మహాదేవపురం, డీ-బ్లాక్, సీ-బ్లాక్‌లో ఇష్టారాజ్యంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వార్తా కథనాలు రావడం, స్థానికులు నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు హాడావిడిగా సిబ్బందితో అదనపు అంతస్తుల వద్దకు వెళ్లి భనాలను సీజ్ చేస్తున్నట్లు, భవనానికి పట్టీలు కట్టి, ముందు బోర్డును ఏర్పాటు చేశారు. సీజ్ చేసి రెండు వారాలు
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం..
కాకముందే ఆ బోర్డును తీసివేసి భవన నిర్మాణ యజమానులు భవనాలకు సున్నాలు వేసి, రంగులను అద్దుతున్నారు. ‘భవనాలను సీజ్ చేస్తే ఏమవుతుంది. ఎంతో కొంత అధికారులతో మాట్లాడుకొని, మళ్లీ అదనపు అంతస్తులు నిర్మిస్తాం’ అని ఓ భవన నిర్మాణ యజమాని బాహాటంగానే చెప్పడం గమనార్హం.
కేసులుపెడతాం అన్నారు..
అదనపు అంతస్తులు నిర్మించేవారిపై చట్టపరంగా కేసులను నమోదు చేస్తామని సర్కిల్ డీసీ మల్లారెడ్డి(Circle DC Mallareddy) తెలిపినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా వెళుస్తున్న అదనపు అంస్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2024 | 08:38 AM