Hyderabad: పార్కు స్థలం కబ్జాకు యత్నం.. రంగంలోకి ‘హైడ్రా’
ABN, Publish Date - Dec 21 , 2024 | 09:08 AM
‘చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జూలై 2024 తరువాత అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను మాత్రమే కూలుస్తాం. ఇప్పటికే నివాసముంటోన్న భవనాల జోలికి హైడ్రా వెళ్లదు. నివాసేతర నిర్మాణాలైతే.. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా చర్యలుంటాయి’ అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.
- పత్రాలు ఇవ్వాలంటూ స్థానికులకు నోటీసులు
- ఆందోళనతో ప్రజా ప్రతినిధులు, న్యాయవాదుల వద్దకు పరుగు
హైదరాబాద్ సిటీ: ‘చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జూలై 2024 తరువాత అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలను మాత్రమే కూలుస్తాం. ఇప్పటికే నివాసముంటోన్న భవనాల జోలికి హైడ్రా వెళ్లదు. నివాసేతర నిర్మాణాలైతే.. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా చర్యలుంటాయి’ అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఓ వైపు ప్రకటన విడుదల చేసిన సంస్థ.. మరో వైపు 20-30 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఉంటోన్న వారికి నోటీసులు జారీ చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అదనపు అంతస్తులు సీజ్.. వారానికే యథాతథంగా పనులు
ఇంటి అనుమతి తీసుకున్న ప్లాన్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్లు, లే అవుట్ ప్లాన్, కోర్టు కేసు ఉంటే ఆ వివరాలు సమర్పించాలని పేర్కొంది. మూడు రోజుల గడువుతో ఈ నెల 18వ తేదీన వెంగళరావునగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 70 మందికి హైడ్రా నోటీసులిచ్చింది. దీంతో భవనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెలిసిన అధికారులు, న్యాయవాదుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఇదీ కథాకమామిషు..
ఖైరతాబాద్ మండలం పాత యూసు్‌ఫగూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45, 46, 47, 48లో 44.38 ఎకరాల భూమి ఉంది. నవాబుల కుటుంబం పేరిట ఉన్న భూమిని ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు 1975లో కొనుగోలు చేసింది. 40 ఎకరాల భూమిని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజిస్తూ లేఅవుట్ అభివృద్ధి చేసింది. ఇందులోని ప్లాట్లను వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లక్కీడిప్ ద్వారా కేటాయించింది. ప్లాట్లు పొందిన వారు రెండు నుంచి ఆరంతస్తుల వరకు భవనాలు నిర్మించుకున్నారు. కొందరు నివాసేతర అవసరాలకూ వినియోగిస్తున్నారు. ఖాళీగా ఉన్న నాలుగు ఎకరాల ఖాళీ స్థలంలో రెండు ఎకరాలను కొందరు వ్యక్తులు ప్లాట్లు చేసి విక్రయించారు.
ఆ స్థలంలోనూ నిర్మాణాలు వెలిశాయి. ఇప్పటికీ ఖాళీగా ఉన్న మరో 2.5 ఎకరాల భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం అది పార్కు స్థలమంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు బోర్డు ఏర్పాటు చేయగా.. కొందరు వ్యక్తులు తొలగించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా ఈనెల 18వ తేదీన 70 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో హౌసింగ్ బోర్డు కేటాయించిన ప్లాట్లలోని భవనాల యజమానులూ ఉన్నారు. ‘30 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాం. ఇప్పుడు నోటీసులిచ్చి డాక్యుమెంట్లు తీసుకురమ్మంటున్నారు. ఇదేం అన్యాయం’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
స్థలాన్ని కాపాడేందుకే నోటీసులిచ్చాం
అది పార్కు స్థలం. ఇప్పటికే రెండెకరాలు కబ్జా అయినట్టు మా దృష్టికి వచ్చింది. మరో 2.5 ఎకరాల ఆక్రమణకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ స్థలాన్ని కాపాడేందుకే నోటీసులిచ్చాం. వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకువస్తే పరిశీలించి.. అన్యాయం జరగకుండా చూస్తాం. ఈ స్థలానికి సంబంధించి మూడు కేసులు కోర్టులో ఉన్నాయి. భూమి తమదని చెబుతోన్న వారి వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు. ఉంటే చూపించాలని చెప్పాం. దానిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. సరైన ఆధారాలు చూపించకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకొని పార్కును అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీని కోరుతాం. గతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటోన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి వద్ద ఉన్న పత్రాలు చూపిస్తే చాలు. - ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2024 | 09:08 AM