ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రాచకొండ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం..

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:46 AM

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌(Rachakonda Police Commissionerate) పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సీపీ(Rachakonda CP) ఉత్తర్వులు జారీచేశారు.

- ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌(Rachakonda Police Commissionerate) పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు(Rachakonda CP G. Sudhir Babu) ఉత్తర్వులు జారీచేశారు. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని సిబ్బందికి సూచించారు. డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని, చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ మిక్సర్లు, యాంప్లిఫయర్‌, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Janimaster: జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరు.. కానీ


ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే బీఎన్‌ఎస్ సెక్షన్‌ 223, 280, 292, 293, 324, 152తో పాటు.. పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్‌ 15 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. అతిక్రమించిన ట్లు నిర్థారణ అయితే నిందితులకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాచకొండ పరిధిలోని అన్నిజోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

................................................................

Hyderabad: ఐదుగురు సంతానం ఉన్నా.. అనాథలుగా తల్లిదండ్రులు

- బ్రిడ్జి కింద జీవిస్తున్న వృద్ధ దంపతులు

హైదరాబాద్: ఆ దంపతులకు ఐదుగురు సంతానం. అయినా అనాథలుగా బతుకుతున్నారు. రెండు వారాల నుంచి గగన్‌పహాడ్‌(Gaganpahad) మార్గంలో బ్రిడ్జి కింద ఉంటున్నారు. వారిని చూసిన రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌రెడ్డి, హోంగార్డులు చిరంజీవి, శివకుమార్‌ ప్రతీరోజూ భోజనం అందజేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ జిల్లా, కోయిలకొండ మండలం, మాసన్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, కుమారుడు.


వీరు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న దంపతులు రాజేంద్రనగర్‌ సర్కిల్‌(Rajendranagar Circle) గగన్‌పహాడ్‌ వద్ద బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. వారిని చూసిన ట్రాఫిక్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డులు ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌కు విషయం చెప్పారు. ఆయన సూచన మేరకు దంపతుల వద్ద పిల్లల ఫోన్‌ నంబర్‌ తీసుకొని వారితో మాట్లాడారు. మీ తల్లిదండ్రులు గగన్‌పహాడ్‌ వద్ద ఉన్నారని చెప్పగా.. వారినుంచి సరైన స్పందన లేదు. మరలా ఫోన్‌ చేసినా ఫలితం లేదు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులే వారికి భోజనం పెట్టిస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 03 , 2024 | 11:46 AM