ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఉమ్మడి రంగారెడ్డిలో బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్‌.. ‘చేతి’కి చిక్కిన మహేందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2024-02-09T12:31:41+05:30

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‏కు భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి(Former minister Mahender Reddy)తోపాటు ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

- చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి!

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‏కు భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి(Former minister Mahender Reddy)తోపాటు ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో మంచిపట్టున్న మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం బీఆర్‌ఎస్‏కు పెద్ద దెబ్బేనని చెప్పాలి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీఆర్‌ఎస్‌ తాండూరు టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ వైపు చూశారు. పలు దఫాలు ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే ఇది గమనించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించింది. దీంతో ఆయన పార్టీ మారే యోచన విరమించుకున్నారు. మహేందర్‌రెడ్డిని ఎలాగైనా కాంగ్రెస్ కు రప్పించాలని రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల తేదీకి వారం రోజుల ముందుకూడా ఆయనకు భారీ ఆఫర్‌ ఇచ్చారు. కానీ, అప్పటి పరిస్థితుల్లో ఆయన బీఆర్‌ఎస్‏లోనే కొనసాగాలని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు పలుమార్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో చివరకు మహేందర్‌రెడ్డి ఆయన భార్య సునీతారెడ్డి కాంగ్రెస్‏లో చేరాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మహేందర్‌రెడ్డి కుటుంబం చేరిక వెనుక బలమైన కారణమే ఉంది. మహేందర్‌రెడ్డి భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్‌ సీటు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి కుటుంబానికి స్పష్టమైన హామీ కూడా లభించడంతో కాంగ్రెస్‏లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతుండడంతో అధికార కాంగ్రెస్‌ కూడా ఆర్థిక, అంగబలం ఉన్న వారిని పోటీలో దింపేయత్నం చేస్తోంది. మహేందర్‌రెడ్డి కుటుంబంతో పాటు ఆయన అనుచరులు ఈనెల 11వ తేదీలోగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

మల్కాజిగిరిపై తర్జనభర్జనలు

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి కూడా కాంగ్రెస్‏లో పోటీ ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న వారి కోసం కాంగ్రెస్‌ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మైనంపల్లి హన్మంతరావు కూడా పోటీకి సై అంటున్నట్లు సమాచారం. అలాగే సీనియర్‌ నేత కుసుమకుమార్‌తోపాటు హరివర్ధన్‌రెడ్డి తదితరులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదు.

ఎమ్మెల్యేలపై గురి!

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు వలసలకు గేట్లు తెరవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఎమ్మెల్యేలను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి త్వరలో తాను కూడా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని కలుస్తానని, కీసర ఆలయానికి రావాలని ఆహ్వానిస్తానని చెప్పారు. తాజాగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగర శివార్లలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 11వ తేదీలోగా బీఆర్‌ఎ్‌సలో భారీ కుదుపులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.

Updated Date - 2024-02-09T12:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising