ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తాళం పగులగొట్టి ఇంటి గోడలు కూల్చివేత

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:28 PM

జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది.

- వాగ్వాదానికి దిగడంతో వెళ్లిపోయిన అధికారులు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మూసాపేట్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు శనివారం బాలాజీనగర్‌(Balajinagar)లోని హెచ్‌ఐజీ 53లో అక్రమ నిర్మాణం అంటూ చేపట్టిన కూల్చివేతలు దుమారం లేపాయి. 267 గజాల్లో స్టిల్ట్‌ ప్లస్‌ 3 అంతస్తులకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకొని ఐదు అంతస్తులు నిర్మించా రు. ఏడాది క్రితమే భవనం పూర్తయి ప్రస్తుతం ఐదో అంతస్తులోని రెండు ఫ్లాట్స్‌లో ఒకదాంట్లో గత తొమ్మిది నెలలుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో దాంట్లో ఇంటి యజమానికి చెందిన కంపెనీ సిబ్బంది ఉంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad Police: హైదరాబాద్‌వాసులకు బిగ్ షాక్.. టపాసులు కాల్చడంపై నిషేధం


నివాసం ఉంటున్న ఇంటిని ఎటువంటి అనుమతి లేకపోయినా హైడ్రా కూడా కూల్చదని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తాజాగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ప్రభావతి(GHMC Town Planning Supervisor Prabhavathi) దగ్గరుండి తాళం తొలగించి కిటికీలు, గోడలు తొలగించడమే కాదు.. స్లాబ్‌కు రంధ్రాలు పెట్టడం కూకట్‌పల్లి ప్రాం తంలో హాట్‌టాపిక్‌ఘా మారింది. ఇది ఇలా ఉండగా.. గతంలో ఇక్కడ పనిచేసిన సూపర్‌వైజర్‌, చైర్‌మెన్‌కు ముడుపులు ఇచ్చారా? కొత్తగా వచ్చిన నన్ను పట్టించుకోరా అన్న కోణంలో ఆమె వ్యవహరించారా అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.


ఇదే భవన నిర్మాణంలో ఇద్దరు ముగ్గురు తొలి నుంచీ ఫిర్యాదులు చేస్తూనే ఉండడంతో ఇదే అదనుగా చేసుకొని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేతలకు పాల్పడినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న మేమే టీపీఎస్‌ మా ఇంటిని కూల్చడానికి మీకు ఉన్న అధికారాలు ఏంటి, ఉంటే ఏదైనా నోటీసు చూపండంటూ ఆమెపై వాగ్వాదానికి దిగడంతో పనులు ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఇంటి యజమాని సోదరుడు సుబ్బారావు తెలిపారు. దీనిపై టీపీఎస్‌ ప్రభావతి, ఏసీపీ మల్లేశ్వర్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా వారు అందుబాటులోకి రాలేదు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..

ఈవార్తను కూడా చదవండి: Minister Ponnam: నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి..

ఈవార్తను కూడా చదవండి: ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

ఈవార్తను కూడా చదవండి: TG Police: 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 27 , 2024 | 01:28 PM