ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : ’దానం’ పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉంది

ABN, Publish Date - Jul 31 , 2024 | 06:29 AM

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రె్‌సలోకి మారిన దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు.

  • వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించండి

  • హైకోర్టును కోరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రె్‌సలోకి మారిన దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానం పార్టీ మారినట్లు బహిరంగ సాక్ష్యం ఉందని తెలిపారు. ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ టికెట్‌పై ఎంపీగా పోటీ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లంలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్‌లపై మంగళవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జే రామచంద్రరావు వాదనలు కొనసాగిస్తూ అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పీకర్‌కు సమయం నిర్దేశించిందని చెప్పారు. దానం ఇతర పార్టీ టికెట్‌పై పోటీ చేయడం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 06:30 AM

Advertising
Advertising
<