ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : మేడిగడ్డను బాగుచేయడంలో సర్కారు విఫలం

ABN, Publish Date - Jul 22 , 2024 | 06:09 AM

మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

  • ఎన్‌డీఎ్‌సఏ, ప్రభుత్వ అలసత్వంతో రైతులకు నష్టం: హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. వరదలు రాకముందే మేడిగడ్డ రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఏమాత్రం దృష్టిపెట్టలేదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) సమయం వృథా చేసిందని ఆరోపించారు.

ఎన్‌డీఎ్‌సఏ నివేదిక పేరిట ప్రభుత్వం అలసత్వం కారణంగా.. రాష్ట్ర రైతాంగం నష్టపోవాల్సి వస్తోందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఎ్‌సఏ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శించారు.

మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్నిచర్యలు తీసుకున్నామంటూనే అక్కడ మట్టిపరీక్షలు సాధ్యపడలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు మాని కాంగ్రెస్‌ ప్రభుత్వం పంటలకు సాగునీరు అందేలా చూడాలని.. రైతులకు నష్టం కలగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 22 , 2024 | 06:09 AM

Advertising
Advertising
<