Hyderabad: మైనారిటీలను వాడుకున్నది కాంగ్రెస్.. ఆదుకున్నది మోదీ
ABN, Publish Date - Oct 09 , 2024 | 01:08 PM
స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు.
- ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించిననాటి నుంచి మైనారిటీలను వాడుకున్నదని కాంగ్రెస్ పార్టీ అని వారిని ఆదుకున్నది మాత్రం నరేంద్రమోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(Chevella MP Konda Visveshwar Reddy) అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్‌కేపురం డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ రాధధీరజ్‌రెడ్డితో కలిసి బీజేపీ(BJP) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేర్పాటువాదులతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి భారతదేశం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ వారికి రిజర్వేషన్లు ఇస్తామని ఎలా చెబుతారన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Gali Janardhan Reddy: పోలీసుల అదుపులో ‘గాలి’ కారు!
రాహుల్‌గాంధీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుందన్న విశ్వసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలన్నా... అభివృద్ధి పథం వైపు నడవాలన్నా బీజేపీకి అండగా నిలవాలన్నారు. దేశం మీద ప్రేమ ఉన్నవారు బీజేపీ తప్ప వేరే పార్టీలను చూడరన్నారు.
బీజేపీ విజయోత్సవం...
హరియాణా ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆర్‌కేపురం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధీరజ్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి పిట్టా ఉపేందర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, జంగయ్యయాదవ్, అరుణ, రాములు యాదవ్, సంతోష్, వెంకట్‌రెడ్డి, రమేష్, శ్రీనివాస్, సుమ, భవాని పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Harish Rao: ఫీజుల చెల్లింపుల్లో సర్కారు నిర్లక్ష్యం
ఇదికూడా చదవండి: Mulugu: కాటేసిన పాము, కరెంటు!
ఇదికూడా చదవండి: విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్
ఇదికూడా చదవండి: Investment Scam: స్టాక్ బ్రోకింగ్ పేరుతో.. ఘరానా మోసం!
Read Latest Telangana News and National News
Updated Date - Oct 09 , 2024 | 01:08 PM