ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

ABN, Publish Date - Dec 11 , 2024 | 10:30 AM

తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.

- మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ధ్వజం

- జిల్లెలగూడలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు. అసలు ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఏం ఒరగబెట్టిందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, తెలంగాణతల్లి విగ్రహం లో మార్పులు, బతుకమ్మ చీరలు మాయం చేయడం.. ఇదా అభివృద్ధి అంటే?.. అని ఆమె నిలదీశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఢిల్లీ అసెంబ్లీ బరిలో మజ్లిస్‌..


తెలంగాణతల్లి విగ్రహంలో మార్పులు చేసి కొత్త విగ్రహం ప్రతిష్ఠించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ జిల్లెలగూడలోని చందచెరువు కట్టపై గల తెలంగాణతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ అప్పట్లో కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమకారులు, మేధావులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన రూపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి జీవం పోశారని, ఇప్పు డు ఆ విగ్రహం రూపాన్ని అర్థం పర్థం లేకుండా మార్చేశారని ఆరోపించారు.


తెలంగాణలో కేసీఆర్‌(KCR) ముద్ర లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్‌ పన్నాగమని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో మేయర్‌ దుర్గాదీప్‏లాల్‌, డిప్యూటీ మే యర్‌ తీగల విక్రమ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ భూపాల్‌రెడ్డి, పార్టీ మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి, సరూర్‌నగర్‌ మాజీ ఎంపీపీ లావణ్యబీరప్ప, పలువురు కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


బడంగ్‌పేట్‌లో..

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని బాలాజీనగర్‌ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆ ధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భం గా విగ్రహానికి క్షీరాభిషేకం చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు గు ప్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సూర్ణగంటి అర్జున్‌, కార్పొరేటర్లు పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, పార్టీ నాయకులు పెద్దబావి ఆనంద్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణ, కృష్ణారెడ్డి, గణేశ్‌, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


ప్రజల తలరాతలు మార్చాలి.. విగ్రహాలను కాదు: సుధీర్‌రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్‌: ప్రభుత్వం మారితే, ప్రజల తలరాతలు మార్చాలి కానీ..తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. చైతన్యపురి డివిజన్‌ ప్రభాత్‌నగర్‌ కాలనీలో ఉన్న తెలంగాణతల్లి విగ్రహానికి మంగళవారం ఆయన క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో రూపొందించిన తె లంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కాంగ్రెస్‌ తల్లిగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ అస్థిత్వం మీద దాడి చేస్తూ, చరిత్ర ఆనవాళ్లను నాశనం చేసేందుకు కుట్రచేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్‌లీడర్‌ పులిపాటి త్రివేది, బీఆర్‌ఎస్‌ చైతన్యపురి డివిజన్‌ అధ్యక్షుడు మహే్‌షయాదవ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రవి ముదిరాజ్‌, గట్టు శ్రీను, జయశ్రీ, రమణారెడ్డి, జలందర్‌, నిరంజన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


ఆర్‌కేపురంలో..

ఎల్‌బీనగర్‌ : ప్రజల తలరాతలు మారుస్తానని తెలంగాణ తల్లిని మారుస్తావా అని బీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్‌కేపురంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు పెండ్యాల నగేష్‌, రామాచారి, రామ్‌నర్సింహగౌడ్‌, సాజిద్‌, కొండ్ర శ్రీనివాస్‌, వెంకటేష్ గౌడ్‌, కంచర్ల శేఖర్‌, జగన్‌, శ్రీమన్నారాయాణ, పెంబర్తి శ్రీనివాస్‌, బాలుశ్రీ పాల్గొన్నారు.


హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దు: సామ

సైదాబాద్‌: హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి మాకొద్దని బీఆర్‌ఎస్‌ యాఖత్‌పురా నియోజకవర్గ ఇన్‌చార్జి సామ సుందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేశవనగర్‌లో తెలంగాణతల్లి ప్లెక్సీకి బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ సామ స్వప్నారెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు మెట్టు భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌, నర్సింగరావు పాల్గొన్నారు


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 10:30 AM