Hyderabad: జ్వరపీడితుల గుర్తింపునకు ఇంటింటి సర్వే..
ABN, Publish Date - Jul 11 , 2024 | 09:37 AM
సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో జ్వర పీడితుల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ(Christina Chongtoo) అధికారులను ఆదేశించారు.
- సమీక్షా సమావేశంలో క్రిస్టినా
హైదరాబాద్ సిటీ: సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో జ్వర పీడితుల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ(Christina Chongtoo) అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆమ్రపాలి కాట(Commissioner Amrapali Kata)తో కలిసి వైద్యారోగ్య, పారిశుధ్యం, ఎంటమాలజీ విభాగాల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా జ్వరాల వ్యాప్తిపై ఆరా తీశారు. సర్వేలో జ్వరం ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో వెంటనే వారికి అవసరమైన చికిత్స, పరిసరాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. డెంగీ(Dengue) వ్యాధుల నియంత్రణకు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఇదికూడా చదవండి: Warangal: ఎంజీఎంలో నిలిచిన 2డీ ఎకో పరీక్షలు..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వరద, మురుగు నీటి నిల్వతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్రమం తప్పకుండా రసాయనాలు పిచికారి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలను అదనపు కమిషనర్ రవికిరణ్ వివరించారు. గ్రేటర్‌లో 225 బస్తీ దవాఖానాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖను కోరినట్టు తెలిపారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 11 , 2024 | 09:37 AM