Hyderabad: అనుమతి నుంచి రెన్యూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే..
ABN, Publish Date - Dec 19 , 2024 | 08:47 AM
ప్రకటనల విభాగంలో సంస్కరణలకు జీహెచ్‌ఎంసీ(GHMC) శ్రీకారం చుట్టింది. ఆదాయం పెంపు.. అవకతవకలకు ఆస్కారం లేకుండా నూతన పాలసీ రూపొందిస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు.
- ప్రకటనల విభాగంలో సంస్కరణలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం
- నూతన విధానంపై కసరత్తు
- ఆదాయం పెంపు.. అవకతవకలకు చెక్‌పెట్టేందుకు మార్పులు
హైదరాబాద్ సిటీ: ప్రకటనల విభాగంలో సంస్కరణలకు జీహెచ్‌ఎంసీ(GHMC) శ్రీకారం చుట్టింది. ఆదాయం పెంపు.. అవకతవకలకు ఆస్కారం లేకుండా నూతన పాలసీ రూపొందిస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో దీనిపై చర్చించారు. ప్రకటనల విభాగం ద్వారా ప్రస్తుతం రూ.20-30 కోట్లకు మించి ఆదాయం రావడం లేదు. ప్రకటనల విభాగంలోని కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కమిషనర్ ఇలంబరిది వద్ద గురువారం జరిగే సమావేశంలో ఈ విషయంపై చర్చించనున్నారు. అనంతరం నూతన పాలసీని ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: న్యూ ఇయర్ వేడుకలపై నిఘా..
బోర్డుల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
దుకాణాల వద్ద బోర్డుల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఎంతమంది దుకాణదారులు బోర్డుల కోసం అనుమతి తీసుకున్నారు..? అక్రమంగా ఏర్పాటు చేసిన వారెందరు..? అన్న లెక్కలు లేవు. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదుల ఆధారంగా గతంలో సీఈసీ- ఈవీడీఎం(CEC- EVDM) విభాగం జరిమానా విధించేది. ఇప్పుడా సంస్థ లేకపోవడంతో జరిమానాల విధింపు నిలిచిపోయింది.
బోర్డు పరిమాణం ఆధారంగా రుసుము నిర్ధారించాల్సి ఉండగా.. వాస్తవ ఫీజు కంటే తక్కువ వసూలు చేసి సిబ్బంది వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని నిర్ధారణకు వచ్చారు. దీంతో అనుమతుల నుంచి రెన్యూవల్ వరకు అంతా ఆన్‌లైన్‌లో జరిగేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనుమతి ఉన్న బోర్డుల వివరాలనూ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
ట్రేడ్ లైసెన్స్‌లనూ అనుసంధానం చేయడం ద్వారా.. ఎన్ని దుకాణాలు బోర్డుల ఏర్పాటుకు అనుమతి తీసుకున్నాయన్నది తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దుకాణాల బోర్డులు ఉండకూడదు. నగరంలోని పలు దుకాణాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. వారికి జరిమానా ఆన్‌లైన్‌లో విధించేలా మార్పులు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 08:47 AM