Hyderabad: మాజీ మంత్రి హరీష్‌రావు తొమ్మిది గుంటలు కబ్జా చేశారు..
ABN, Publish Date - Nov 28 , 2024 | 10:08 AM
ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని చెబుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు(Former Minister Harish Rao), తన భూములపై విచారణ జరపాలని సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు లేఖ రాసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన న్యాయవాదులు జెల్ల రవీందర్ యాదవ్, కుంచం అశోక్ యాదవ్, రమేష్ పోతరాజు డిమాండ్ చేశారు.
- నిజాయితీ నిరూపణకు సీఐడీ విచారణ కోరాలి
హైదరాబాద్: ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని చెబుతున్న మాజీ మంత్రి హరీష్‌రావు(Former Minister Harish Rao), తన భూములపై విచారణ జరపాలని సీఐడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు లేఖ రాసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లాకు చెందిన న్యాయవాదులు జెల్ల రవీందర్ యాదవ్, కుంచం అశోక్ యాదవ్, రమేష్ పోతరాజు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్‌రావు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆయన రాజ్యాంగం ఇప్పటికీ కొనసాగుతోందని ఆరోపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Rs.10 coins: రూ.10 నాణేలు తీసుకోవట్లే..
సిద్దిపేట అభివృద్థిలో దూసుకుపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అభివృద్థి మాటున అరాచకాలు ఎన్నో కొనసాగుతున్నాయన్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి ఎకరాల కొద్దీ భూమిని కొనుగోలు చేశారని. రంగనాయక సాగర్ కోసం సేకరించిన భూమి నుంచి 9 గుంటలను అక్రమంగా తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
తాను ఒక్క గుంట భూమిని కూడా కబ్జా చేయలేదని చెబుతున్న ఆయన సీఐడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (సుడా) పేరిట జరిగిన అక్రమాలు ఎన్నో ఉన్నాయని, సమగ్రంగా విచారణ జరిపి వెలికితీయాలని ప్రభుత్వాన్ని కోరారు. హరీష్ రావు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అక్రమ కేసుల్లో ఇరుక్కున్నామన్నారు. ఆయన భూ ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2024 | 10:08 AM