Hyderabad: ఖైరతాబాద్ గణపతికి లక్ష రుద్రాక్షల మాల..
ABN, Publish Date - Sep 10 , 2024 | 09:00 AM
ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు.
హైదరాబాద్: ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్(Khairatabad) ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శ్రీసప్తముఖ మహాశక్తి గణపతికి లక్ష రుద్రాక్షలతో కూడిన మాలను సమర్పించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుంచి తెప్పించిన రుద్రాక్షమాలను సంఘం ఆధ్వర్యంలో వాసవీ కేంద్రం నుంచి భారీ ఊరేగింపుతో తీసుకువచ్చి గణపతికి సోమవారం సమర్పించారు. ఇందులో ఆర్యవైశ్య సంఘం, ఖైరతాబాద్ అధ్యక్షుడు దేవరశెట్టి వీరేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి బెలిదె రాజు గుప్తా, సలహాదారులు కొండ్లె మల్లిఖార్జునగుప్త, కోశాధికారి ప్రకాష్ గుప్తా, ప్రతినిధులు అరుణార్తి మహేష్, గోపిశెట్టి ప్రవీణ్, మల్లికార్జున రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: CV Anand: గణేశ్ బందోబస్తు.. అసలైన ఫైనల్స్
శివపార్వతుల కల్యాణం
- హాజరైన ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ భారీ గణపతి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. సంఘం రాష్ట్ర కోశాధికారి కళ్లపల్లి రాచప్ప ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వేద బ్రాహ్మణులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గణపతికి కుడివైపున శివపార్వతుల కళ్యాణ ఘట్టంతో కూడిన విగ్రహాలు ప్రతిష్టించిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు రాచప్ప తెలిపారు. ఈ ఉత్సవంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
..................................................................
ఈ వార్తను కూడా చదవండి:
.....................................................................
Hyderabad: జీహెచ్‌ఎంసీకి రూ.10,500 కోట్లు ఇవ్వండి
- ఫైనాన్స్ కమిషన్‌కు మేయర్ వినతి
- ప్రజాభవన్‌లో సమావేశంలో పాల్గొన్న విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ: మహానగరంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, వరద నీటి నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలని 16వ ఫైనాన్స్ కమిషన్‌కు జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అభివృద్ధి పనులు, అప్పుల చెల్లింపునకు రూ.10,500 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, 1.40 కోట్లకు చేరుకున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందని వివరించారు.
గత పదేళ్లలో మౌలిక వసతులు, పౌర సేవలు, ఇతరత్రా పనుల కోసం జీహెచ్‌ఎంసీ రూ.18 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో రూ.6 వేల కోట్లు వివిధ రూపాల్లో రుణంగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్‌లో సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఎన్ క్యాప్ నిధులు మాత్రమే ఇస్తున్నారని, హెచ్-సిటీలో భాగంగా వంతెనల నిర్మాణం, నాలాల అభివృద్ధి, విస్తరణ తదితర పనులకూ నిధులు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్న ఆమె సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఫైనాన్స్ కమిషన్ అధికారులను కోరారు.
వీటి కోసమే నిధులు...
- కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేలా అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారుల అభివృద్ధి, సమగ్ర నిర్వహణ, వరద నీటి ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు రూ.7500 కోట్లు.
- అధునాతన పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణలో భాగంగా బయోరెమిడేషన్, బయో మైనింగ్‌కు రూ.1500 కోట్లు.
- చారిత్రక కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణకు రూ.200 కోట్లు.
- చెరువుల పరిరక్షణ, వరద నీటి నిర్వహణకు రూ.800 కోట్లు.
- మహానగరంలోని ఆస్తులు, యుటిలిటీస్ వివరాలను జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎ్‌స)లో భాగంగా గుర్తించేందుకు రూ.250 కోట్లు.
- కృత్రిమ మేధతో కూడిన ట్రాఫిక్ నిర్వహణ, మొబైల్ యాప్ రూపకల్పన, విపత్తుల నిర్వహణకు రూ.250 కోట్లు.
- వీటితో పాటు స్వతంత్రంగా రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలని మేయర్ కోరారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 10 , 2024 | 09:00 AM