ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జీఐఎస్‌ సర్వే.. మెరుగైన పౌరసేవల కోసమే..

ABN, Publish Date - Aug 09 , 2024 | 10:31 AM

మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, వనరుల నిర్వహణ కోసమే జీఐఎస్‌ సర్వే చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) తెలిపారు.

- ప్రణాళిక, వనరుల నిర్వహణకు ఉపయుక్తం

- భవనాలు, యుటిలిటీల వివరాలు మాత్రమే సేకరణ

- ఆధార్‌, పాన్‌ కార్డు వంటి వ్యక్తిగత సమాచారం తీసుకోం

- నల్లా, విద్యుత్‌ కనెక్షన్ల వివరాలివ్వడమూ మీ ఇష్టమే

- 130 చ.కి.మీల డ్రోన్‌ సర్వే పూర్తి

- ప్రతి భవనానికి యూనిక్‌ ఐడీ

- సులువుగా సేవలు పొందే అవకాశం

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట

హైదరాబాద్‌ సిటీ: మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, వనరుల నిర్వహణ కోసమే జీఐఎస్‌ సర్వే చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) తెలిపారు. భవనాలకు యూనిక్‌ ఐడీ కేటాయింపుతో చిరునామా తెలుసుకోవడం సులభమవుతుందని, రోడ్లకు యూనిక్‌ ఐడీతో వాటి నిర్మాణం, నిర్వహణ సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు. జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కమిషనర్‌ స్నేహ శబరీష్‏తో కలిసి ఆమె మాట్లాడారు.

ఇదికూడా చదవండి: Minister Sitakka: ఆదివాసి గూడేల అభివృద్ధే నిజమైన ప్రగతి


జీఐఎస్‌ సర్వే(GIS survey) ఎందుకోసం చేస్తున్నామన్నది వివరించారు. గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలు, చెరువులు, పార్కుల సమాచారం కోసం రెండు విధాలుగా సర్వే కొనసాగుతుందన్నారు. డ్రోన్‌ సర్వే, శాటిలైట్‌ చిత్రాల పరిశీలనతో పాటు క్షేత్రస్థాయిలో సిబ్బంది సమాచారం సేకరిస్తారని చెప్పారు. ఆధార్‌, పాన్‌ వంటి పౌరుల వ్యక్తిగత సమాచారం తీసుకోవడం లేదని, సిబ్బంది అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. భవనాలకు సంబంధించి ఆస్తి పన్ను నంబర్‌ (పీటీఐఎన్‌), ఎన్ని అంతస్తులు, అపార్ట్‌మెంటా...? ఇండిపెండెంట్‌ భవనమా..? వినియోగ కేటగిరీ..? భవనం అనుమతి, లిఫ్ట్‌, పవర్‌ బ్యాకప్‌, సెల్లార్లు, అగ్నిమాపక ఏర్పాట్లు, ఇంకుడుగుంత, సివరేజీ కనెక్షన్‌ తదితర సమాచారం తీసుకుంటామన్నారు.


పౌరులకు ఇష్టం లేకుంటే నల్లా కనెక్షన్‌ (సీఏఎన్‌), విద్యుత్‌ కనెక్షన్‌ల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. భవన నిర్మాణ అనుమతి వివరాలు అందుబాటులో లేకుంటే.. డేటాబేస్ లో పరిశీలిస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన అనంతరం వివరాలను సంబంధిత యజమానులు పరిశీలించవచ్చని, మార్పులు చేయాల్సి ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు. పౌరుల సమాచారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్‌టెల్‌ సర్వర్‌లో భద్రంగా ఉంటుందన్నారు. సర్వే ఎలా జరుగుతుందన్న దానిపై హైదరాబాద్‌ ఐఐటీ, జేఎన్‌టీయూలతో క్వాలిటీ చెక్‌ చేయిస్తామన్నారు.


ఇప్పటికే డ్రోన్‌ సర్వే..

650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రేటర్‌లో 130 చదరపు కిలోమీటర్ల మేర (ఎనిమిది సర్కిళ్లలో) డ్రోన్‌ సర్వే పూర్తయ్యిందని ఆమ్రపాలి చెప్పారు. వాతావరణం సహకరించకపోవడంతో కొంత ఆలస్యమవుతున్నదని, మార్చి లేదా మే వరకు జీఐఎస్‌ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 90 బృందాలు ఉన్నాయని, వీటి సంఖ్యను 600లకు పెంచాలని ఏజెన్సీకి సూచించామన్నారు. జూలై 30న సర్వే ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 300 భవనాల వివరాలు సేకరించామన్నారు.


జీహెచ్‌ఎంసీ పరిధిలో 19.30 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుండగా.. ఇందులో 2.70 లక్షల నివాసేతర కేటగిరీ ఆస్తులున్నాయని పేర్కొన్నారు. చార్మినార్‌ జోన్‌లో కూడా సర్వే నిర్వహిస్తామని, అక్కడి పౌరులను ఒప్పించేందుకు అవసరమైన వారి సహకారం తీసుకుంటామన్నారు. సర్వే కోసం రూ.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. నగరంలోని రెడ్‌జోన్లలో డ్రోన్‌సర్వే చేయడం లేదని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తామన్నారు. భవనాలు, యుటిలిటీల వివరాలు సేకరిస్తామని, ఇది ఆస్తిపన్నుపెంపునకు కాదని, పెంచాలా..? వద్దా..? అన్నది ప్రభుత్వ నిర్ణయమని వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 10:31 AM

Advertising
Advertising
<