Share News

Hyderabad: ఫోన్‌ లాక్కుని.. లాకప్ పక్కన నేలపై కూర్చోబెట్టి..

ABN , Publish Date - Aug 03 , 2024 | 12:09 PM

చెక్‌బౌన్స్‌ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌(Malakpet Police Station)కు వెళ్లిన ఫిర్యాదుదారుడి పట్ల స్టేషన్‌ రైటర్‌ దురుసుగా ప్రవర్తించాడు. నిందితుడి తరహాలో అతడి మొబైల్‌ఫోన్‌ లాక్కొని.. పోలీస్‏స్టేషన్‌లో లాకప్‌ పక్కన నేలపై కూర్చోబెట్టాడు. అంతటితో ఆగకుండా కేసు బుక్‌ చేస్తానంటూ బెదిరించాడు.

Hyderabad: ఫోన్‌ లాక్కుని.. లాకప్ పక్కన నేలపై కూర్చోబెట్టి..

- ఫిర్యాదుదారుడి పట్ల స్టేషన్‌రైటర్‌ దురుసు ప్రవర్తన

- కేసు బుక్‌ చేస్తామని బెదిరింపులు

- మలక్‌పేట పీఎస్‏లో ఘటన

హైదరాబాద్: చెక్‌బౌన్స్‌ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌(Malakpet Police Station)కు వెళ్లిన ఫిర్యాదుదారుడి పట్ల స్టేషన్‌ రైటర్‌ దురుసుగా ప్రవర్తించాడు. నిందితుడి తరహాలో అతడి మొబైల్‌ఫోన్‌ లాక్కొని.. పోలీస్‏స్టేషన్‌లో లాకప్‌ పక్కన నేలపై కూర్చోబెట్టాడు. అంతటితో ఆగకుండా కేసు బుక్‌ చేస్తానంటూ బెదిరించాడు. ఈఘటన మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. బాధితుడు తాళ్ల గణేశ్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో మలక్‌పేటలో నివాసముంటున్న ప్రవీణరెడ్డి వ్యాపార లావాదేవీలకు సంబంధించి రూ.5లక్షలకు చెక్‌ ఇచ్చింది. చెక్‌బౌన్స్‌(Checkbounce) కావడంతో గణేశ్‌గౌడ్‌ అప్పట్లోనే కోర్టును ఆశ్రయించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బల్దియాలో ఇంటి దొంగలు.. రూ.కోట్లు కొల్లగొట్టిన బిల్‌ కలెక్టర్లు


కోర్టు మొదట్లో బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా, ప్రవీణరెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈకేసు విషయమై గణేశ్‌గౌడ్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నికలు, బోనాల విధుల పేరుతో బిజీ అంటూ గణేశ్‌గౌడ్‌(Ganesh Goud)ను పోలీసులు తర్వాత రమ్మని చెప్పేవారు. శుక్రవారం ఉదయం గణేశ్‌గౌడ్‌ మలక్‌పేట పోలీస్టేషన్‌కు వెళ్లాడు. డ్యూటీలో ఉన్న స్టేషన్‌ రైటర్‌ చారికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌కు చెందిన వివరాలను ఫోన్‌లో చూపేందుకు ప్రయత్నించాడు. రైటర్‌ ఆ ఫోన్‌ను లాక్కున్నాడు. తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చానని చెబుతున్నా వినకుండా, తనకు తప్పుడు మాటలు చెబుతావా అంటూ అతడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. దుర్భాషలాడుతూ నిందితుడిని ట్రీట్‌చేసినట్లుగా చూశాడు. లాకప్‌ పక్కన దాదాపు 2 గంటలపాటు కూర్చోబెట్టారు. కేసు బుక్‌ చేస్తానని బెదిరించడంతో గణేశ్‌గౌడ్‌ అక్కడే కూర్చుండిపోయాడు.


ఎస్‌ఐ వచ్చాక..

ఉదయం 11 గంటల తర్వాత ఎస్‌ఐ వచ్చి అతడిని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారని జనరల్‌ డైరీ రాసే హెడ్‌ కానిస్టేబుల్‌ను ప్రశ్నించగా అతడు విషయం చెప్పాడు. అనంతరం గణేశ్‌గౌడ్‌ను విజిటర్‌ చెయిర్‌లో కూర్చోమని ఎస్‌ఐ సూచించారు. గణేశ్‌గౌడ్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటికి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‏కు విన్నవించగా, పీఎస్‏లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి విచారణ జరిపిస్తానని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయవాదిని సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్‌ సలహా ఇచ్చి పంపించారు. అనంతరం రైటర్‌ చారి తీరుపై సౌత్‌ఈస్ట్‌ జోన్‌డీసీపీ పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌కు శుక్రవారం మధ్యాహ్నం గణేశ్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు. రైటర్‌ తన పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని, విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Updated Date - Aug 03 , 2024 | 12:46 PM