Kukatpally: టు-లెట్ కోసం క్యూఆర్ కోడ్
ABN, Publish Date - Jul 30 , 2024 | 03:25 AM
స్మార్ట్ యుగంలో అందరూ స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సాంకేతికతను మన నిత్యకృత్యాలకు ఆపాదిస్తున్నారు. ఓ ఇంటి యజమాని కూడా ఇలాగే ఆలోచించారు కాబోలు తన ఇంటి గేటుకు క్యూ ఆర్ కోడ్ ఉన్న బోర్డును వేలాడదీశారు.
కూకట్‌పల్లిలో ఇంటి గేటుకు తగిలించిన యజమాని
కేపీహెచ్‌బీకాలనీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ యుగంలో అందరూ స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. సాంకేతికతను మన నిత్యకృత్యాలకు ఆపాదిస్తున్నారు. ఓ ఇంటి యజమాని కూడా ఇలాగే ఆలోచించారు కాబోలు తన ఇంటి గేటుకు క్యూ ఆర్ కోడ్ ఉన్న బోర్డును వేలాడదీశారు. సాధారణంగా ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే ఎవరైనా ... ముందు గేటుకు టు-లెట్ బోర్డు పెట్టి దాని మీద ఫోన్ నంబర్ రాస్తారు. ఇక్కడ మాత్రం అద్దెకు దిగాలనుకునేవారు ముందు కోడ్‌ను స్కాన్ చేసి... అందులో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే.
పూర్తి పేరు, విద్యార్హత, ఎక్కడ పనిచేస్తున్నారు ? ఎంత మంది ఉంటారు? హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్లవుతుంది ? ఇలా అన్ని వివరాలు తెలియజేయాలి. అప్పుడే యజమాని అద్దెకు ఇవ్వాలా లేదా అన్నది నిర్ణయించుకుంటారు. వారంరోజులుగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భువన విజయం గ్రౌండ్ సమీపంలో ఆ ఇంటి గేటుకు తగిలించిన స్కానర్‌ను స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది వింతగా అనిపించినా భవిష్యత్తులో అద్దెకు ఇచ్చే ఓనర్లు నిశ్చింతగా ఉండవచ్చని పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు.
Updated Date - Jul 30 , 2024 | 03:25 AM