Hyderabad: నల్లా మీటర్ పనిచేయట్లే!
ABN, Publish Date - Oct 18 , 2024 | 08:47 AM
నల్లాలకు ఏర్పాటు చేసిన నీటి మీటర్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మీటరు పనిచేయట్లేదని ఫిర్యాదు చేస్తే కూడా ఏజెన్సీలు స్పందించడం లేదు. నీటి మీటర్లను విక్రయించిన ఏజెన్సీలే పూర్తి సర్వీసు బాధ్యత వహించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నాయి.
- సర్వీసు చేయని పలు ఏజెన్సీలు
- కొత్త మీటరు ఏర్పాటు చేసుకోవాలని ఉచిత సలహా
హైదరాబాద్ సిటీ: నల్లాలకు ఏర్పాటు చేసిన నీటి మీటర్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. మీటరు పనిచేయట్లేదని ఫిర్యాదు చేస్తే కూడా ఏజెన్సీలు స్పందించడం లేదు. నీటి మీటర్లను విక్రయించిన ఏజెన్సీలే పూర్తి సర్వీసు బాధ్యత వహించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యహరిస్తున్నాయి. మీటరు దెబ్బతిన్నదని, కొత్త మీటరు ఏర్పాటు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాయి. ఇక మీటరు పని చేయకపోతే ఏజెన్సీలకు ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాల్సిన మీటరు రీడర్లు కూడా పట్టించుకోవడం లేదు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైడ్రా ఫోకస్.. ఇక ఫుట్‌పాత్ ఆక్రమణలపై..
గ్రేటర్‌లో 47 లక్షల గృహ కనెక్షన్లు
మీటరు రీడింగ్ ఆధారంగానే నీటి బిల్లులను వాటర్‌బోర్డు వసూలు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నల్లా మీటరు ఏర్పాటు తప్పనిసరైంది. గతంలో కేవలం వాణిజ్య కనెక్షన్లకు మాత్రమే మీటర్లు ఉంటుండగా.. మూడేళ్ల నుంచి మురికివాడల్లో మినహా గృహా, వాణిజ్య, బల్క్ ఇలా అన్ని కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది. గృహ కనెక్షన్‌దారులు ఏఎంఆర్ మీటర్లను (స్మార్ట్ మీటర్లు) బిగించుకున్నారు.
మొరాయిస్తున్న ఏఎంఆర్ మీటర్లు
వాటర్‌బోర్డు పరిధిలోని నీటి కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేయడానికి ఐఎ్‌సఐ మార్క్‌తోపాటు గుర్తింపు కలిగిన ఏజెన్సీలతో మూడేళ్ల క్రితం ఎం ప్యానల్ చేశారు. ఇందులో సుమారు 18 కంపెనీల వరకు ఉన్నాయి. ఆయా కంపెనీలు వివిధ డివిజన్లలో మీటర్లను నల్లా కనెక్షన్‌దారులు విక్రయించడానికి వాటర్‌బోర్డు అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఒక్కో నల్లా సైజు కనెక్షన్‌కు ఒక్కో ధరను నిర్ణయించారు. సాధారణంగా 15ఎంఎం నల్లా కనెక్షన్ నీటి మీటర్‌కు రూ.1298కి బదులు అదనంగా వివిధ రకాల చార్జీల పేరుతో రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. 20ఎంఎం నల్లా కనెక్షన్ నీటి మీటర్‌కు రూ.1947 కాగా అదనంగా మరిన్ని చార్జీలతో రూ.3వేలకు పైగా దోపిడీ చేస్తున్నారు.
అంతకు మించి ఇంచు, రెండు ఇంచులు, మూడు ఇంచులకు సంబంధించిన నల్లా కనెక్షన్లకు ఏఎంఆర్ (ఆటోమెటిక్ మీటర్ రీడర్) మీటర్ ధరలు లక్షల్లో ఉన్నాయి. అయితే పలు కంపెనీలు నాణ్యత లోపంతో ఏఎంఆర్ మీటర్లను వినియోగదారులకు బిగించేస్తున్నాయి. దాంతో తరచూ మీటర్లు మొరాయిస్తున్నాయి. తొలుత మీటర్లకు గ్యారంటీ, వారంటీ ఇచ్చి పాడయ్యాక అవేం వర్తించవని దాటవేస్తున్నాయి. సాధారణంగా డిజిటల్ మీటర్ స్ర్కీన్ నీళ్లలో మునిగినా, కొన్ని నీళ్లు పడినా పాడవుతున్నాయి. స్ర్కీన్ రావడం లేదు. దాంతోపాటు సంపుల పక్కనే ఉండే స్మార్ట్ మీటర్ చల్లని పరిస్థితుల్లో స్ర్కీన్‌లో నీటిచెమ్మ వస్తుండడంతో కొన్ని రోజులకు పాడవుతున్నాయి.
వాటర్‌బోర్డుకు పెద్దఎత్తున ఫిర్యాదులు
అపార్ట్‌మెంట్లు, వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన నీటి మీటరు స్ర్కీన్ రాకపోయినా, అసలు పని చేయకపోయినా ఫిర్యాదు చేస్తే ఏజెన్సీలు స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా మీటర్ పాడైందంటే చాలు.. కొత్తది బిగించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. పాడైన మీటర్‌ను మాత్రం బాగు చేయడం లేదు. నీళ్లు పోవడం వల్లే మీటర్ పాడైందని, కొత్తది ఏర్పాటు చేసుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఓ కనెక్షన్ మీటర్ పాడవ్వగా పలుమార్లు ఫిర్యాదు చేసిన కానీ స్పందించలేదు.
ప్రధానంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్(Madapur, Jubilee Hills, Banjara Hills), గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ, నిజాంపేట, ఎల్‌బీనగర్, ఉప్పల్, మణికొండ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా మీటర్లను బిగిస్తున్నారు. ఆయా ఏజెన్సీలు బిగించే మీటర్లపై వాటర్‌బోర్డుకు ఉన్నతస్థాయిలో పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఏజెన్సీల నిర్వహణ తీరు అధ్వానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఫిర్యాదులపై స్పందించని ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో చేర్చేందుకు యోచిస్తున్నారు.
ఇదికూడా చదవండి: BJP: కిషన్‌రెడ్డిపై అనుచిత వీడియోలు తొలగించాలి
ఇదికూడా చదవండి: Vijay Babu: కేసీఆర్ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ హయంలో నాసిరకం చీరలు ఇచ్చి.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారు
ఇదికూడా చదవండి: బతుకమ్మ చీరల విషయంలో సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు: హరీశ్
Read Latest Telangana News and National News
Updated Date - Oct 18 , 2024 | 08:57 AM