ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నియో.. కుయ్యో మొర్రో...

ABN, Publish Date - Jul 20 , 2024 | 09:59 AM

నగర రవాణా గతిని మార్చేసిన మెట్రో రైళ్లకు(Metro trains) రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం రెండోదశ పనులపై దృష్టి సారించింది. మెట్రో రైళ్లను నడిపించలేని ప్రాంతాలకు అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేయాలని నగరవాసులు కోరుతున్నారు.

- మెట్రో నియోకు మోక్షం కలిగేదెన్నడో?

- నగరవాసుల ఎదురుచూపులు

- ప్రకటనలకే పరిమితమైన గత సర్కారు

- కాంగ్రెస్‌ పట్టించుకోవాలని వినతులు

హైదరాబాద్‌ సిటీ: నగర రవాణా గతిని మార్చేసిన మెట్రో రైళ్లకు(Metro trains) రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం రెండోదశ పనులపై దృష్టి సారించింది. మెట్రో రైళ్లను నడిపించలేని ప్రాంతాలకు అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేయాలని నగరవాసులు కోరుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(BRS Govt) పట్టించుకోని పనులను పూర్తిచేసి మెరుగైన రవాణాను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నారు. ప్రధానంగా మెట్రో నియో ప్రాజెక్టు(Metro Neo Project)పై ఆశలు చిగురిస్తున్నాయి. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో మెట్రో నియో, మెట్రో లైట్‌ లాంటి మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఆర్‌టీఎస్‌) నిర్వహణ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని నగరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారు.

ఇదికూడా చదవండి: డ్రగ్‌ పెడ్లర్‌గా బీటెక్‌ విద్యార్థి..


మెట్రో రైళ్ల విస్తరణ కంటే తక్కువ వ్యయంతో నిర్మించే అవకాశమున్న మెట్రో నియోను అందుబాటులోకి తెచ్చి ప్రస్తుత మెట్రోకి అనుసంధానంగా నడిపిస్తే బాగుంటుందని అప్పట్లో భావించారు. గతంలో ప్రతిపాదించిన మెట్రో రెండోదశ విస్తరణ పనుల కంటే ముందే మెట్రో నియోను పూర్తిచేయాలని, కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌- మియాపూర్‌ మార్గానికి అనుసంధానంగా ఎలివేటెడ్‌ బస్‌ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్‌) ప్రతిపాదనలు పూర్తి చేయాలని మెట్రో అధికారులను అప్పట్లో ఆదేశించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆశలు

మెట్రో రెండోదశ విస్తరణపై కాంగ్రెస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు 6 కారిడార్లలో 70 కిలోమీటర్ల పనులను రూ.17,500 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటిదశలో నిలిచిపోయిన ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా (5.5 కి.మీ.) పనులకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ కారిడార్‌లో అత్యంత ప్రాధాన్యమున్న మెట్రో నియో ప్రాజెక్టు విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, మెట్రో రైలు నిర్మాణంలో కిలోమీటరుకు రూ.250 కోట్లు ఖర్చయితే.. మెట్రో నియోకు రూ.100-110 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.


ప్రకటనలకే పరిమితం

హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులతోపాటు సాధారణ ప్రయాణికులకు ట్రాఫిక్‌ రహిత రవాణా అందించాలనే లక్ష్యంతో తొలుత ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్)ను ప్రతిపాదించారు. 2022లోనే దీనికి సంబంధించిన డీపీఆర్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ నిధుల కొరతతో పనులు చేపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈబీఆర్‌టీఎస్‌ మాదిరి విదేశాల్లో నడిచే మెట్రో నియో ప్రాజెక్టును నగరానికి తీసుకురావాలని భావించారు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తెస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో అడుగు ముందుకు పడలేదు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 09:59 AM

Advertising
Advertising
<