ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొత్త బస్సులు సిద్ధం.. త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌లు

ABN, Publish Date - Jul 31 , 2024 | 10:06 AM

కొత్త బస్సులు వచ్చాయని, త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హైదరాబాద్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌(Hyderabad Region Regional Manager B. Varaprasad) తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రద్దీ సమయాల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని వివరించారు.

- ఆగస్టు చివర్లో మరో 110 బస్సులు

- హైదరాబాద్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌

హైదరాబాద్‌ సిటీ: కొత్త బస్సులు వచ్చాయని, త్వరలో 5 రూట్లలో 10 మెట్రో డీలక్స్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హైదరాబాద్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ బి.వరప్రసాద్‌(Hyderabad Region Regional Manager B. Varaprasad) తెలిపారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రద్దీ సమయాల్లో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నదని వివరించారు. ఎంజీబీఎస్‏లో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన హైదరాబాద్‌ సిటీ రీజియన్‌ పరిధిలో 14 బస్సు డిపోల ద్వారా రోజూ 1309 బస్సులను 247 రూట్లలో 3.84 లక్షల కిలోమీటర్లు తిప్పుతున్నామన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: దొంగలను పట్టించిన స్టిక్కర్‌.. అసలేం జరిగిందంటే..


రోజూ సుమారు 10.77లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుండగా వారిలో 7.71లక్షల మంది మహిళలు ఉంటున్నారని వివరించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్‌(Hyderabad, Secunderabad Region)లో ఆగస్టు చివరి నాటికి మొత్తం 120 మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.


6 రూట్లలో 42 ఏసీ బస్సులు

గ్రేటర్‌లోని ఆరు రూట్లలో 42 ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను ఆర్టీసీ నడుపుతోందని, ప్రయాణికుల ఆదరణ పెరుగుతోందని వరప్రసాద్‌ తెలిపారు. మరో నాలుగు రూట్లలో 25 నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులను నడుపుతున్నామన్నారు. కోఠి-పఠాన్‌చెరు(Kothi-Pathancheru) 5, సీబీఎస్‌ నుంచి పఠాన్‌చెరు6, మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి గండిమైసమ్మ 2, సికింద్రాబాద్‌ నుంచి మణికొండ ప్రాంతాలకు 12 నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2024 | 10:06 AM

Advertising
Advertising
<