ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మెట్రోస్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు..

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:04 AM

నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ సిద్ధమైంది. 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుముతో ప్రారంభిస్తామని ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రయాణికులు భగ్గుమంటున్నారు.

- అక్టోబర్‌ 6 నుంచి అమలు చేయనున్న ఎల్‌ అండ్‌ టీ

- నామమాత్రపు రుసుము తీసుకుంటామని ప్రకటన

- ప్రయాణికుల ఆగ్రహం.. నిరసనలకు సిద్ధం

హైదరాబాద్‌ సిటీ: నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్లలో(Nagole, Miyapur metro stations) పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ సిద్ధమైంది. 6వ తేదీ నుంచి నామమాత్రపు రుసుముతో ప్రారంభిస్తామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రయాణికులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పెట్టిన పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడమేమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నుంచి నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెట్రో పార్కింగ్‌ ఫీజు ప్రయాణికులను కొద్ది రోజులుగా పరేషాన్‌ చేస్తోంది. ప్రయాణికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ యాజమాన్యం.. మళ్లీ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు


మియాపూర్‌-ఎల్‌బీనగర్‌(Miyapur-LBnagar), జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్ల(Nagolu-Rayadurgam Corridors) పరిధిలో 57 స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో ఇందులో 10 స్టేషన్లలో మాత్రమే ఉచిత పార్కింగ్‌ సదుపాయం ఉండగా, మిగతా 47 స్టేషన్లలో కొంతకాలంగా ఫీజు వసూలు చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌, మూసారంబాగ్‌, బాలానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, నాగోల్‌, రసూల్‌పురా, ఎర్రమంజిల్‌, పంజాగుట్ట, హైటెక్‌సిటీ స్టేషన్ల వద్ద ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉండడంతో ఉచిత పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు.


మిగతా స్టేషన్ల వద్ద ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు రూ. 10, 2 నుంచి 3 గంటలకు రూ.15, 3 నుంచి 4 గంటలకు రూ. 20, 4 నుంచి 12 గంటలకు రూ. 25 తీసుకుంటున్నారు. కార్లకు రెండు గంటలకు రూ. 30, 2 నుంచి 3 గంటలకు రూ.45, 3 నుంచి 4 గంటలకు రూ. 60, 4 నుంచి 12 గంటల వరకు రూ.75, తర్వాత గంటలను బట్టి చార్జీ వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌ నిర్వహణ బాధ్యతలను పార్క్‌ హైదరాబాద్‌ సంస్థకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సంస్థ టెండర్‌ ప్రాతిపదికన ఇవ్వడంతో నిర్వాహకులు ఫీజు తీసుకుంటూ వాహనాలను క్రమబద్ధీకరిస్తున్నారు.


ఎల్‌ అండ్‌ టీ తీరుపై విమర్శలు

నాగోల్‌, మియాపూర్‌ స్టేషన్లలో పెయిడ్‌ పార్కింగ్‌ను అమలు చేయొద్దని కోరుతున్నప్పటికీ ఎల్‌అండ్‌టీ మొండిగా వ్యవహరిస్తోందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రైవేట్‌ కంపెనీల్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న తమపై పార్కింగ్‌ భారం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. డీవైఎ్‌ఫఐ, పీవైఎల్‌ మళ్లీ నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. .


డిస్కౌంట్‌ ఆఫర్ల పొడిగింపు

మెట్రోరైలు ఆఫర్లను మళ్లీ పొడిగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వచ్చే ఏడాది మార్చి 31 వరకు వివిధ రకాల డిస్కౌంట్లను అందుబాటులో ఉంచినట్లు ఎల్‌అండ్‌టీ చీఫ్‌ స్ర్టాటజీ ఆఫీసర్‌ మురళీ వరదరాజన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూపర్‌సేవర్‌-59 ఆఫర్‌లో భాగంగా ఎల్‌అండ్‌టీ గుర్తించిన సెలవుదినాల్లో రూ.59 టికెట్‌తో ఒక్కరోజు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని చెప్పారు. స్టూడెంట్‌ పాస్‌ కింద విద్యార్థులు 20 ట్రిప్పుల డబ్బులు చెల్లించి 30 ట్రిప్పుల వరకు రాకపోకలు సాగించవచ్చన్నారు.


అలాగే సూపర్‌ సేవర్‌ ఆఫ్‌-పీక్‌ అవర్‌ ఆఫర్‌లో భాగంగా రద్దీ లేని సమయాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంటాక్ట్‌లెస్‌ స్మార్ట్‌కార్డులపై (సీఎస్సీ) 10 శాతం తగ్గింపు ఉంటుందని చెప్పారు. మెట్రోలో వెళ్తున్న వారికి తక్కువ ధరకు ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆఫర్లను మరికొన్ని నెలలపాటు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి

ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే

ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2024 | 10:04 AM