Share News

Hyderabad: పాతబస్తీ బోనాలు.. నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:54 AM

పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్‌ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.

Hyderabad: పాతబస్తీ బోనాలు.. నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

- బందోబస్తు, ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

హైదరాబాద్‌ సిటీ: పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్‌దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్‌ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు. బోనాల సందర్భంగా ఛత్రినాక ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ ట్రాఫిక్‌ విశ్వప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. లాల్‌ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి అక్కన్న మాదన్న టెంపుల్‌ వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఈనేపథ్యంలో 28, 29 తేదీల్లో ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌(Charminar, Meerchowk), బహదూర్‌పురా పోలీస్టేషన్‌లలోని పలు ప్రాంతాలు, నయాపూల్‌ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్‌ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుటాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: TGRTC: ఆర్టీసీకి బకాయిల చెల్లింపుల మాటేమిటి?


28న ఉదయం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు..

- నెహ్రూ విగ్రహం నుంచి లాల్‌ దర్వాజా ఆలయం వరకు వాహనాలను అనుమతించరు.

- హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపునుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు పంపుతారు.

- చాంద్రాయణగుట్ట, కందికల్‌గేట్‌ ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఛత్రినాక ఔట్‌పోస్ట్‌ వైపు పంపుతారు.

29న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు..

- మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను ఇంజన్‌బౌలి, జహానుమా, గోశాల వైపు పంపుతారు.

- పంచ్‌మొహల్లా, చార్మినార్‌, వైపునుంచి వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్‌ వైపు మళ్లిస్తారు.


- చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనాలను ఎస్‌జే రోటరీ, పురాణాహవేలి వైపు పంపుతారు.

- ఖిల్వత్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను మోతీగల్లి టీ జంక్షన్‌ నుంచి ఓల్గా జంక్షన్‌కు పంపుతారు.

పార్కింగ్‌ ప్రాంతాలు

- అలియాబాద్‌ వైపు నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే భక్తులు తమ బైకులను అల్కా థియేటర్‌, దేవీ ఫ్లైవుడ్‌ వద్ద నిలుపుకోవాలి.

- హరిబౌలి గౌలిపురా వైపు నుంచి వచ్చేవారు తమ వాహనాలను సుధా థియేటర్‌ లైనులో పార్కింగ్‌ చేసుకోవాలి.

- మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపునుంచి వచ్చేవారు తమ వాహనాలను చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద నిలుపుకోవాలి.

- అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్‌రోడ్స్‌, ఇంజన్‌బౌలి, గుల్జార్‌హౌస్‌, చార్మినార్‌, హిమ్మత్‌పురా, నాగులచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అనుమతించరు.


100 ప్రత్యేక బస్సులు

లాల్‌దర్వాజా బోనాలకు పలు ప్రాంతాల నుంచి 100 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌, జేబీఎస్‌, జీడిమెట్ల, పటాన్‌చెరు(Jeedimetla, Patancheru), ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌, మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, కూకట్‌పల్లి, రిసాలాబజార్‌, చర్లపల్లి, రాజేంద్రనగర్‌, రాంనగర్‌, ఉప్పల్‌(Charlapalli, Rajendranagar, Ramnagar, Uppal), బోరబండ, మిథాని, కేపీహెచ్‌ బీ కాలనీ, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, బాలాజీనగర్‌ ప్రాంతాల నుంచి ఆదివారం ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. ప్రయాణికుల సేవల కోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివరాలకు 9959226154 (రేతిఫైల్‌), 9959226160 (కోఠి) నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. లాల్‌ దర్వాజ (9959226131), ఎంజీబీఎస్‌ (9000406069), సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ (9959226147), జేబీఎస్‌ (9959226144)లలో డీఎంలను ఇన్‌చార్జిలుగా నియమించామన్నారు.


ఇదికూడా చదవండి: Nagarjuna Sagar: సాగర్‌ నీటి విడుదలకు మా సమ్మతి అక్కర్లేదా?

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 27 , 2024 | 10:40 AM