ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది..

ABN, Publish Date - May 10 , 2024 | 11:04 AM

దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ప్రధాని మోదీ(Prime Minister Modi) పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపుతున్నారని, అందుకే ఎక్కడికెళ్లినా బీజేపీ(BJP)కి అనూహ్యమైన ఆదరణ వస్తుందని, పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకొస్తున్నారని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ప్రధాని మోదీ(Prime Minister Modi) పాలనపై ప్రజలు ఎంతో విశ్వాసం చూపుతున్నారని, అందుకే ఎక్కడికెళ్లినా బీజేపీ(BJP)కి అనూహ్యమైన ఆదరణ వస్తుందని, పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకొస్తున్నారని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి అన్నారు. యూసుఫ్‏గూడలో జరిగిన రోడ్‌షో కార్యక్రమంలో డివిజన్‌కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధాని మోదీకి విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ పద్మ వీరపనేని, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా ఉపాధ్యక్షులు కిలారి మనోహర్‌, లంకల దీపక్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, కుంబాల గంగరాజు, సందీప్‏యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర

‘కిషన్‌ రెడ్డిని గెలిపించండి’

అమీర్‌నేట: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని గెలిపించాలని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం బల్కంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందంటే ప్రధాని మోదీ సుపరిపాలనకు నిదర్శనమని ప్రసూన పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌ యాదవ్‌, వాహేద్‌, రవి, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 11:08 AM

Advertising
Advertising