ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్ల బంధంపై విషం

ABN, Publish Date - Jul 09 , 2024 | 04:08 AM

ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది! కానీ.. ప్రణీత్‌ హన్మంతు అనే ప్రముఖ యూట్యూబర్‌, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా..

  • లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు

  • యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతు, మరో

  • నలుగురి నిర్వాకం.. వారిపై కేసు నమోదు

  • తొలుత స్పందించిన హీరో సాయిధరమ్‌

  • ‘ఎక్స్‌’లో పోస్ట్‌తో 2 రాష్ట్రాల సీఎంల దృష్టికి

  • స్పందించిన సీఎం రేవంత్‌.. చర్యలకు ఆదేశం

  • కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

  • యూట్యూబర్‌ తీరు సమాజానికి హానికరం

  • మండిపడ్డ సినీరంగ ప్రముఖులు

  • ఇది నీచం.. చర్యలు తీసుకోవాలి: ఖుష్బూ

  • తప్పు చేశానంటూ ప్రణీత్‌హన్మంతు క్షమాపణ

  • లైంగిక కోణంలో చూస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హన్మంతు, మరో నలుగురు.. వారిపై ఎఫ్‌ఐఆర్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది! కానీ.. ప్రణీత్‌ హన్మంతు అనే ప్రముఖ యూట్యూబర్‌, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా.. సోషల్‌ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్‌హన్మంతు బృందం వీడియో చూసిన హీరో సాయిధరమ్‌ తేజ్‌.. తొలుత ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్‌ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా, ప్రమాదకరంగా మారిందని.. దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఇలాంటి రాక్షసులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హీరో మంచు మనోజ్‌ కూడా అదే స్ధాయిలో తన ఎక్స్‌ ఖాతాలో సదరు యూట్యూబర్‌పై విరుచుకుపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో పాటుగా టెక్సస్‌ అధికారులు, యుఎస్‌ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్‌ చేసి ప్రణీత్‌ హన్మంతుపై చర్య తీసుకోవాలని కోరారు. హాస్యం పేరిట సామాజిక మాధ్యమాలలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైనది మాత్రమే కాక, ప్రమాదకరం కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై హీరో నారా రోహిత్‌ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్‌ చేస్తూ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాకం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ప్రణీత్ హనుమంతు ఎవరో తెలుసా..



దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సదరు యూట్యూబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రణీత్‌ హన్మంతుతో పాటు మిగతావారిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశామని.. నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల భద్రతకు.. మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని.. హాస్యం పేరిట సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారుల భద్రత, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతోనూ సమన్వయం చేసుకుంటున్నామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఇక.. హాస్యం కోసం సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై చట్టప్రకారం కఠినచర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టేవారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని ఆమె తెలిపారు.


చిన్నారుల భద్రత, సరైన పద్ధతిలో సోషల్‌ మీడియా వినియోగంపై పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ కూడా దీనిపై స్పందించారు. ‘‘తండ్రీకూతుళ్ల విషయంలో ఆ యూట్యూబర్లు ఇలా ప్రవర్తించడం, కామెంట్స్‌ చేయడం నిజంగా నీచమైన విషయం. మరింత జుగుప్సాకరమైన విషయం ఏమిటంటే.. ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా సోషల్‌ మీడియా వేదికగా చేయడం. దీనిపై స్పందించిన మంచు మనోజ్‌ను అభినందిస్తున్నాను. ఈ వ్యవహారంపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నాను’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.


తప్పు చేశాను..

తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఈ వివాదానికి మూలమైన ప్రణీత్‌హన్మంతు బేషరతు క్షమాపణలు చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని.. హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్లిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీనితో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు. కాగా.. తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా గతంలో ప్రణీత్‌ హన్మంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ, ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను. అందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను’ అని కార్తికేయ పేర్కొన్నారు.


అలాగే.. ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్‌ హన్మంతుకు తన ‘హరోంహర’ సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహ్యం వేస్తోంది అంటూ హీరో సుధీర్‌ క్షమాపణలు చెప్పారు. ‘‘అలాంటి నీచుల గురించి సోషల్‌ మీడియాలో మాట్లాడాలన్నా ధైర్యం చాలట్లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం భావప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు’’ అని సుధీర్‌బాబు పేర్కొన్నారు. మరో హీరో విశ్వక్‌సేన్‌ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్‌ చేశారు.

Updated Date - Jul 09 , 2024 | 07:55 AM

Advertising
Advertising
<