ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teacher Award: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:40 AM

హైదరాబాద్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

  • తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయులకు అందజేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అలాగే, తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తిరుమలాయపాలెం జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఉపాధ్యాయుడు పీసర ప్రభాకర్‌రెడ్డి, దమ్మన్నపేట జడ్పీహెచ్‌ఎ్‌స ఉపాధ్యాయుడు తాడూరి సంపత్‌కుమార్‌, హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజ్‌స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ అధ్యాపకురాలు వనమాల స్వప్న కూడా అవార్డులు అందుకున్నారు.


అదే విధంగా ఏపీలోని గుడివాడ ఎస్పీఎస్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాసరావు, ఉరండూర్‌ జడ్పీహైస్కూల్‌ ఉపాధ్యాయుడు సురేష్‌ కునాటి కూడా పురస్కారాలు స్వీకరించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరందరికీ అవార్డులు ప్రదానం చేశారు.

Updated Date - Sep 06 , 2024 | 05:40 AM

Advertising
Advertising