ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పబ్‌లు, బార్‌లలో ఎక్సైజ్‌ఆకస్మిక దాడులు

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:33 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

  • హైదరాబాద్‌ పరిధిలో 25 బృందాలతో డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు

  • ఇకపై వారాంతాల్లో తనిఖీలు

హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఎక్సైజ్‌ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారాంతం నేపథ్యంలో డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు నిర్వహించారు. ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషీ ఆదేశాలతో.. అసిస్టెంట్‌ కమిషనర్లు ఆర్‌.కిషన్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి..


హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధుల్లోని 25 ప్రముఖ పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 12, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 ప్రాంతాల్లో శనివారం రాత్రి 10 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులకు 12-ప్యానెల్‌ డ్రగ్స్‌ డిటెక్షన్‌ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఇకపై వారాంతాల్లో ఆకస్మిక తనిఖీలను కొనసాగిస్తామని కమలాసన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 04:33 AM

Advertising
Advertising
<