Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..
ABN, Publish Date - Nov 14 , 2024 | 07:32 AM
రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్, మటన్ డీప్ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్ - ఇవీ మాసబ్‌ట్యాంక్‌లోని మొఘల్, డైన్‌హిల్ హోటళ్లలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదనపు కమిషనర్(హెల్త్) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.
- హోటళ్లలో నాణ్యత లేని ఆహారం విక్రయం
- తందూరి చికెన్ నుంచి మటన్ ఫ్రై వరకు
- నల్లగా మారిన నూనె వినియోగం
- మేయర్ తనిఖీల్లో బట్టబయలు
- ఎఫ్‌ఎ్‌సవోల పనితీరుపై అసంతృప్తి
హైదరాబాద్ సిటీ: రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన తందూరి చికెన్, మటన్ డీప్ ఫ్రై(Chicken and mutton deep fry).. రా చికెన్.. నల్లగా మారిన నూనె.. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌లలో దుర్వాసన.. కుళ్లిన కూరగాయలు.. పురుగులు పడ్డ సూప్ - ఇవీ మాసబ్‌ట్యాంక్‌లోని మొఘల్, డైన్‌హిల్ హోటళ్లలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అదనపు కమిషనర్(హెల్త్) పంకజ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలు. అక్కడి పరిస్థితులను చూసి వారు విస్తుపోయారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
ఇలాంటి పదార్థాలను అందిస్తారా ? ప్రజారోగ్యమంటే లెక్కలేదా ? వండిన ఆహారాన్ని మరుసటి రోజు వేడి చేసి వడ్డించడమా..? ఆహార పదార్థాలకు లేబుల్ లేకుండా నిల్వ చేస్తారా..? బ్యాక్టిరీయా వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురి కారా..? ఎందుకింత నిర్లక్ష్యమని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా హోటళ్లకు జరిమానా విధించాలని ఏఎంఓహెచ్‌లను పంకజ ఆదేశించారు. పరిస్థితి మారకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. రెండు హోటళ్లలో ప్రమాణాలు పాటించడం లేదని, వండిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్టు గుర్తించామని మేయర్ తెలిపారు.
చెప్పినా వినరా..?
అంతకుముందు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల(ఎఫ్ఎస్ఓ)తో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కల్తీ ఆహార పదార్థాల నియంత్రణ, ఆహర భద్రత మెరుగుదలకు ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్ఓల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ’ఎవరికి వారుగా హోటళ్లకు వెళ్లకుండా. ఏఎంఓహెచ్, వెటర్నరీ, ఎఫ్‌ఎ్‌సఓలు కలిసి టీంగా తనిఖీలు నిర్వహించాలని గతంలో చెప్పాం.
అయినా మీరు పద్ధతి మార్చుకోలేదు. చర్యలు తీసుకోనప్పుడు తనిఖీలు నిర్వహించి ఏం లాభం. కలిసి పనిచేసేందుకు మీకున్న ఇబ్బందులేంటి’ అని అన్నారు. గతంతో పోలిస్తే తనిఖీలు పెరిగినా.. మరింత విస్తృతంగా అందరూ కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార విక్రయశాలలను పరిశీలించాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆహార విక్రయ కేంద్రం నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాలని, ప్రమాణాల ప్రకారం లేకున్నా.. ప్రమాదకరమని తేలినా తదుపరి చర్యలకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2024 | 07:32 AM