Hyderabad: సామాజిక వివక్ష రూపుమాపేందుకు ‘సర్వే’ దోహదం
ABN, Publish Date - Nov 08 , 2024 | 01:33 PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) అన్నారు.
- మాజీ ఎంపీ వి.హనుమంతరావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు(Former MP V. Hanumantha Rao) అన్నారు. సమ గ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైన నేపథ్యంలో బాగ్‌అంబర్‌పేటలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ ర్యంలో గురువారం రాహుల్ గాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: లింక్ పంపి రూ.1.45 లక్షలు దోచేశారుగా..
హనుమంత రావుతో పాటు అంబర్‌పేట కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ సి. రోహిణ్‌రెడ్డి హాజరై క్షీరాభిషేకం చేశారు. అలాగే, అంబర్‌పేట డీఎంసీ మారుతి దివాకర్ ఆధ్వర్యం లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో పాల్గొని ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. అనంతరం వి.హనుమంత రావు మాట్లాడుతూ, జనాభాకు అనుగుణంగా రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు అందాలంటే సమగ్ర కులగణన జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించిందన్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో ఈ సర్వేను నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరిగే సర్వేలో ప్రజలందరూ పాల్గొనే విధంగా కాంగ్రెస్ పార్టీ నా యకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శంబుల శ్రీకాంత్‌గౌడ్, ఖైర తాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్, మాజీ కార్పొరేటర్లు రాంబాబు, పుల్లా నారాయణ స్వామి, పులిజగన్, గరిగంటి శ్రీదేవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2024 | 01:33 PM