Hyderabad: ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ ఆదర్శం..
ABN, Publish Date - Oct 11 , 2024 | 08:40 AM
ఉద్యోగాల భర్తీలో, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి మన్నె మహేష్‌యాదవ్(My name is Mahesh Yadav) అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి మన్నె మహేష్‌యాదవ్
హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి మన్నె మహేష్‌యాదవ్(My name is Mahesh Yadav) అన్నారు. ఉద్యోగాల భర్తీతో ఎన్నో పేద కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, ఉపాధ్యాయులను పట్టించుకోలేదని ఆరోపించారు. 15 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ఘనత రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
కులగణన, ఆరు గ్యారంటీలు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై ప్రభుత్వం మార్గదర్శకంగా ముందుకు సాగుతుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రాను పటిష్టంగా అమలు చేయడంతో పాటు మూసీ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదు కుంటుందన్నారు. రాష్ట్ట్రం పాడి పంటలతో విరాజిల్లాలని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని మొక్కుకుని దసరా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
....................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Hyderabad: బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ సీలింగ్ భూమే..
హైదరాబాద్: అంబర్‌పేట నియోజకవర్గం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని సర్వే నెంబర్ 563/1 లోని 6.23 ఎకరాల బతుకమ్మకుంట స్థలం ముమ్మాటికీ ప్రభుత్వ సీలింగ్ భూమేనని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Former MP V. Hanumantha Rao) అన్నారు. బీఆర్‌ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ కాజేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినట్లు పేపర్లు ఉంటే ఎడ్ల సుధాకర్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశా రు.
ఆ స్థలాన్ని కాపాడాలని తాను పోరాడు తుంటే తనపై పరువు నష్టం దావా వేస్తానని సుధాకర్‌రెడ్డి(Sudhakar Reddy) ప్రకటించారని, ఆయన వేసే పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గురువారం బాగ్ అంబర్ పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్ మాట్లాడారు. బతుకమ్మకుంటలో గత 40 ఏళ్ల క్రితం దసరా పండగ సందర్భంగా స్థానిక మహిళలు బతుకమ్మ ఆడి, బతుకమ్మలను అక్కడి చెరువులో నిమజ్జనం చేసిన చరిత్ర ఉందన్నారు. తాను చిన్న వయసులో తన స్నేహితులతో కలిసి ఆ చెరువులో ఈత కొట్టామని గుర్తు చేశారు.
ఈ చెరువు స్థలం నవాబుదని 1989లో వచ్చిన ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం 6.23 ఎకరాల స్థలాన్ని యజమాని మిగులు భూమిగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ లే అవుట్ ప్రకారం కూడా బతుకమ్మ కుంట ప్రభుత్వ సీలింగ్ భూమే అని అన్నారు. దానిని ఎలాగైనా ఆక్రమించు కోవాలనే కుట్రతో ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆ యజమానికి 4 లక్షల డబ్బులు ఇచ్చి కొనుగోలు పత్రం రాయించుకున్నా రని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దల అండ దండలతో ఈ విలువైన స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నించగా తాను అడ్డుకుని రక్షిస్తున్నానని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి బతుకమ్మ కుంటను పరిరక్షించాలని తాను ఫిర్యాదు చేశానన్నారు. దీనికి సంబంధించి హైడ్రా పాత గూగుల్ మ్యాప్‌ను పరిశీలించి ఈ స్థలాన్ని కాపాడేందుకు ప్రయత్ని స్తుందన్నారు. సమావేశంలో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పుల్లా నారాయణస్వామి, పి.జ్ఞానేశ్వర్ గౌడ్, దిడ్డి రాంబాబు, పులి జగన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్‌యాదవ్, కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 11 , 2024 | 08:40 AM