Share News

Hyderabad: సాగర్‌లో తగ్గిపోతున్న జలాలు.. హైదరాబాద్ వాసులకు ఇక్కట్లే..

ABN , Publish Date - Jan 25 , 2024 | 12:11 PM

నాగార్జునసాగర్‌(Nagarjunasagar) నీటిమట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాద్ మహానగరానికి మూడు ఫేజ్‌ల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయి.

Hyderabad: సాగర్‌లో తగ్గిపోతున్న జలాలు.. హైదరాబాద్ వాసులకు ఇక్కట్లే..

- వాటర్‌బోర్డు అప్రమత్తం

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌(Nagarjunasagar) నీటిమట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాద్ మహానగరానికి మూడు ఫేజ్‌ల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయి. సాగర్‌ నుంచి ప్రతీ రోజు సరఫరా అయ్యే 270 ఎంజీడీ (మిలియన్‌ గ్యాలన్లు పర్‌ డే)ల నీళ్లు నిలిచిపోకుండా వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పంపింగ్‌ కోసం అక్కడ ఉన్న భారీ మోటర్లకు విద్యుత్‌ పరమైన పనులు రూ.1.56 కోట్లతో చేపట్టేందుకు వాటర్‌బోర్డు టెండర్లు ఆహ్వానించింది.

Updated Date - Jan 25 , 2024 | 12:13 PM