Hyderabad: దొంగలను పట్టించిన స్టిక్కర్.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 31 , 2024 | 09:45 AM
ఆ ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తోటి స్నేహితుల మాదిరిగా ఫ్యాషనబుల్‌గా కనిపించాలని ఆరాటపడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో సెల్‌ఫోన్లు(Cell phones) స్నాచింగ్ చేసి అమ్మాలని పథకం వేశారు. ఒకరి నుంచి సెల్‌ఫోన్ దొంగిలించారు. వాహనంపై సరదాగా వేసుకున్న స్టిక్కర్ వారిని పోలీసులకు పట్టించేసింది.
- సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులో దొరికిన విద్యార్థులు
హైదరాబాద్: ఆ ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తోటి స్నేహితుల మాదిరిగా ఫ్యాషనబుల్‌గా కనిపించాలని ఆరాటపడ్డారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో సెల్‌ఫోన్లు(Cell phones) స్నాచింగ్ చేసి అమ్మాలని పథకం వేశారు. ఒకరి నుంచి సెల్‌ఫోన్ దొంగిలించారు. వాహనంపై సరదాగా వేసుకున్న స్టిక్కర్ వారిని పోలీసులకు పట్టించేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన రామకృష్ణ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 25(Jubilee Hills Road No. 25)లో నివాసముంటున్నాడు.
ఇదికూడా చదవండి: Hyderabad : ఈవోడబ్ల్యూకు జీఎస్టీ స్కాం కేసు
ఈ నెల 24న విధులకు హాజరై ఇంటికి తిరిగి వెళ్లేందుకు జూబ్లీహిల్స్‌లో మెట్రోరైలు(Metro Rail) దిగాడు. అదే దారిలో అతని భార్య ఆటోలో వస్తుండడంతో ఆమెకోసం రోడ్డు పక్కనే నిలబడి మొబైల్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఫోన్ లాక్కొని రాంగ్‌రూటులో పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలను(CC cameras) పరిశీలించారు. నిందితులు కేటీఎం బైక్‌పై వచ్చినట్టు గుర్తించారు. అయితే, నిందితులు బైక్ నంబర్ కనిపించకుండా బ్లాక్ స్టిక్కర్ అంటించారు.
దీంతో పోలీసులు కేటీఎం వాహనాలు వాడుతున్న వారి నంబర్లను షోరూం నుంచి తెప్పించారు. నగరంలో సుమారు 962 బైక్‌ల జాబితా రావడంతో వాటిలోని అనుమానిత వాహనాల జాబితాను సిద్ధం చేశారు. నిందితులు ఉపయోగించిన వాహనంపై రెడీ టు రేస్ అనే స్టిక్కర్‌ను పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. బేగంపేట(Begumpet)కు చెందిన కుర్ర కిరణ్‌కుమార్, మరో మైనర్ కలిసి స్నాచింగ్ చేసినట్టు విచారణలో తేలింది. కిరణ్‌ను రిమాండ్‌కు, మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News