ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: శంషాబాద్‌లో ‘పులి’ కలకలం.. జనం బెంబేలు!

ABN, Publish Date - Jun 25 , 2024 | 12:49 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌(Shamshabad) మండల పరిధిలోని ఘన్సిమియాగూడలో పులి కలకలంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాంతో సోమవారం జిల్లా ఫారెస్ట్‌ అధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మండల పరిధిలోని ఘన్సిమియాగూడ, శంకరపురం పరిసరాల్లో పులి ఆనవాళ్ల(పాదముద్రలు)ను గుర్తించారు.

- ఆనవాళ్లను గుర్తించిన ఆటవీశాఖ అధికారులు

- పాదముద్రలు పులివా? లేక హైనావా?

- ల్యాబ్‌కు పంపిన ఫారెస్ట్‌ అధికారులు

- రెండు బోన్లు, పది కెమెరాల ఏర్పాటు

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌(Shamshabad) మండల పరిధిలోని ఘన్సిమియాగూడలో పులి కలకలంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాంతో సోమవారం జిల్లా ఫారెస్ట్‌ అధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మండల పరిధిలోని ఘన్సిమియాగూడ, శంకరపురం పరిసరాల్లో పులి ఆనవాళ్ల(పాదముద్రలు)ను గుర్తించారు. ఈమేరకు రెండు బోన్లు, పది సీసీ కెమెరాలను(CC cameras) ఏర్పాటు చేశారు. ఘన్సిమియాగూడ చెరువు వద్దకు పులి వచ్చిందని, పాదముద్రలు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి రెండు లేగదూడలను చంపిందని ఆయా గ్రామాల రైతులు తెలిపారు. అయితే, అసలు అది పులినా? లేక హైనానా అనేది అధికారులకు అంతుచిక్కడం లేదు. ఘన్సిమియాగూడ చెరువు వద్ద గుర్తించిన పాదముద్రల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: సైదాబాద్‌లో గాల్లోకి పోలీసుల కాల్పులు..


కొన్ని ప్రాంతాల్లో చిన్న వయస్సుగల చిరుత పులి పాదముద్రలు ఉన్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో హైనా పాదముద్రలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపితే ఆ గుర్తులు పులివా? లేదా హైనావా? లేక అడవి పిల్లివా? అనేది గుర్తించనున్నట్లు ఆటవీ శాఖఅధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్ల వద్దని, గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు. త్వరలోనే మరిన్ని సీసీకెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో ఎయిర్‌పోర్టులో చిరుత పులిని పట్టుకున్నామని, ఒకవేళ ఇక్కడ కూడా పులి సంచరిస్తున్నట్లయితే త్వరలోనే బంధిస్తామని, సిబ్బంది గస్తీ తిరుగుతున్నారని, ఎవరికి పులి కనిపించినా వెంటనే ఆటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మంగళవారం మరిన్ని బోన్లు ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 12:51 PM

Advertising
Advertising