ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

ABN, Publish Date - Jul 09 , 2024 | 10:31 AM

సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.

హైదరాబాద్: సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌(Khairatabad) మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు. ఆయన చెప్పినట్లే ఉత్సవ కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ గణపతి రూపాన్ని నిర్ణయించారు. ఈసారి వినాయక చవితి 7వ తారీఖున, వారంలోని చివరి (7వ) రోజు శనివారం వచ్చింది.

ఇదికూడా చదవండి: Hyderabad: గ్రేటర్‌లో కొత్త సబ్‌స్టేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌..


దీంతో పాటు 70 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో యాధృచ్చికంగా సప్తముఖ మహాగణపతిని తయారు చేస్తుండడం విశేషమే అవుతుందని విఠలశర్మ తెలిపారు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలతో పీఠాన్ని కలుపుకొని 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని భారీ ఆకారంతో రూపొందిస్తున్నట్లు శిల్పి తెలిపారు. గతంలో తయారైన సప్తముఖ గణపతి ఆకారానికి పూర్తి భిన్నంగా ఈసారి గణపతిని తయారు చేస్తామని ఆయన తెలిపారు. నమూనా చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 10:32 AM

Advertising
Advertising
<