ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మాకూ మెట్రో కావాలి..!

ABN, Publish Date - Aug 09 , 2024 | 08:14 AM

నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీకి మెట్రోరైలు(Metro Rail) చాలామందికి ఉపశమనం కనిపిస్తోంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. రోజువారీగా సుమారు 4.80 లక్షల మందికిపైగా మెట్రోరైళ్లలో ప్రయాణిస్తున్నారు.

- గత సర్కారు హయాంలో 15 రూట్లలో ప్రతిపాదనలు

- వాటిపైనా దృష్టి పెట్టాలని స్థానికుల వినతులు

- గ్రేటర్‌ అభివృద్ధి చెందుతుండడంతో రవాణాపై డిమాండ్‌

- ప్రభుత్వం రెండో దశ విస్తరణపై దృష్టి సారించడంతో ఆసక్తి

- ప్రజలకు అనువైన మార్గాలపై అధ్యయనం

మెట్రోరైలుకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. మా ప్రాంతానికి కావాలంటే.. మాకూ కావాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈనేపథ్యంలో సర్కారు కూడా డిమాండ్లు వస్తున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ రద్దీకి మెట్రోరైలు(Metro Rail) చాలామందికి ఉపశమనం కనిపిస్తోంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. రోజువారీగా సుమారు 4.80 లక్షల మందికిపైగా మెట్రోరైళ్లలో ప్రయాణిస్తున్నారు. సెలవులు, పండుగ వేళల్లో 5 నుంచి 8 శాతం మంది అదనంగా ఉంటున్నారు. వేసవికాలంలో, వర్షాలు కురిసిన సమయంలో తాకిడి అధికంగా కనిపిస్తోంది. రోడ్లపై బస్సులు, ఆటోల్లో వెళ్తూ ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడొద్దనే భావనతో చాలామంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు. నగరంలో వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న మెట్రో విస్తరణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న తమకు కూడా మెట్రో రవాణా సదుపాయాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదికూడా చదవండి: Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!


మమ్మల్ని పట్టించుకోరూ..!

మెట్రో రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో నగర శివారు ప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గతంలో ప్రతిపాదించిన మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. నగరానికి సమీపంలో ఉన్న దమ్మాయిగూడ, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మేడ్చల్‌, కీసర, మహేశ్వరం(Medchal, Keesara, Maheswaram), కందుకూరు, తదితర ప్రాంతాలకు కూడా మెట్రోను తీసుకురావాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు కూడా అందజేశారు.

ఇదికూడా చదవండి: Sampath Kumar: పెట్టుబడులపై రాజకీయాలెందుకు?!


గతంలోని ప్రతిపాదనలు...

- మియాపూర్‌-బీహెచ్‌ఎఈల్‌-పటాన్‌చెరు(15 కిలోమీటర్లు)

- ఎల్‌బీనగర్‌-చాంద్రాయణగుట్ట (9.1 కిలోమీటర్లు)

- నాగోల్‌-శంషాబాద్‌ ఎయుర్‌పోర్టు (31 కిలోమీటర్లు)

- ఫలక్‌నుమా-శంషాబాద్‌ (17 కిలోమీటర్లు)

- బీహెచ్‌ఈఎల్‌-దమ్మాయిగూడ (37.2 కిలోమీటర్లు)

- నానక్‌రామ్‌గూడ-బీహెచ్‌ఈఎల్‌ (13.7 కిలోమీటర్లు)

- ఎంజీబీఎస్‌-ఘట్‌కేసర్‌ (23.2 కిలోమీటర్లు)

- బోయిన్‌పల్లి-మేడ్చల్‌ (19.2 కిలోమీటర్లు)

- ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ (7 కిలోమీటర్లు)

- తార్నాక-కీసర (ఓఆర్‌ఆర్‌-19.6 కిలోమీటర్లు)

- మియాపూర్‌-ఆల్విన్‌కాలనీ (2.4 కిలోమీటర్లు)

- జేఎన్‌టీయూ-ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌ వరకు (16.5 కిలోమీటర్లు)

- జేబీఎస్‌-అల్వాల్‌ (8 కిలోమీటర్లు)

- మియాపూర్‌-గచ్చిబౌలి-టోలీచౌకి-లక్డీకపూల్‌ (20 కిలోమీటర్లు)


మొదటి దశలో 69.2 కిలోమీటర్లు..

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే (2012) మెట్రోరైలు ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. తొలివిడతగా 74.7 కిలోమీటర్లను ప్రతిపాదించినప్పటికీ, పాతబస్తీలో ఆస్తుల సేకరణ విషయంలో అభ్యంతరాలు రావడంతో కారిడార్‌-2లో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు నిర్మిం చారు. కాగా, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టాల్సిన 5.5 కిలోమీటర్లను మధ్యలో వదిలేశారు. కాగా, ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం మధ్యలో మొత్తం 69.2 కిలో మీటర్ల మార్గాన్ని పూర్తి చేసి రైళ్లను నడిపిస్తున్నారు. మొదటి దశ పనులు పూర్తయి 2017 నవంబర్‌ 28 నుంచి మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి తర్వాత నుంచి రెండో దశ డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కిలోమీటర్లు), బీహెచ్‌ఈఎల్‌-లక్డీకపూల్‌ (26 కిలోమీటర్లు), నాగోలు- ఎల్‌బీ నగర్‌ (5 కిలోమీటర్లు) పూర్తి చేసేందుకు ప్రతిపాదించింది. ఇందులో రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రూట్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన కూడా చేశారు.


అయితే ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్న ప్రతిపాదనలను పక్కన పెట్టి.. ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రాంతాలకు మెట్రోను నడిపించే దిశగా ముందుకుసాగుతోంది. ఇందులో గతంలో డిమాండ్‌ వచ్చిన మార్గాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. నాగోలు- ఎల్‌బీనగర్‌-చాంద్రాయణగుట్ట- ఎయిర్‌పోర్టు వరకు (29 కిలో మీటర్లు), మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ బీహెచ్‌ఈఎల్‌- పటాన్‌చెరు (14 కిలోమీటర్లు) పనులను రెండో దశలో చేర్చారు. దీంతోపాటు మరో 6 మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 74.4 కిలోమీటర్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అయితే, మిగతా ప్రాంతాల నుంచి కూడా డిమాండ్లు పెరుగుతుండడం విశేషం.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 09 , 2024 | 08:15 AM

Advertising
Advertising
<