Loan Apps: మనీ యాప్స్ ఆస్తులు అటాచ్
ABN, Publish Date - Aug 22 , 2024 | 08:49 PM
ఆన్ లైన్ మనీ యాప్స్ వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది.
హైదరాబాద్: ఆన్ లైన్ మనీ యాప్స్ (Online Money Loan App) వేధింపులకు క్రమంగా కళ్లెం పడుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపుతోంది. మనీ ల్యాండరింగ్ లాంటి కఠిన చట్టం కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటుంది. ఒక్కో కంపెనీ ఆస్తులు, నగదు నిల్వలను ఎక్కడికక్కడే సీజ్ చేస్తోంది. ఈడీ రంగంలోకి దిగడంతో మనీ యాప్స్ వేధింపుల నుంచి బాధితులకు ఉపశమనం కలుగుతోంది.
వేధించడంతో.. ఉక్కుపాదం..
ఆన్ లైన్ మనీ యాప్ నుంచి రుణం తీసుకున్న వారిని ఛీట్ చేస్తోన్నారు. తీసుకున్న రుణం కట్టినప్పటికీ వేధించడంతో చాలా మంది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వేధింపులు తాళలేక మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ క్రమంలో ఆన్ లైన్ మనీ యాప్‌లపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. మనీ యాప్స్ ఆస్తులను, బ్యాంక్ నిల్వలను అటాచ్ చేస్తోంది. 242 మనీ యాప్స్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.
ఆస్తుల అటాచ్..
ఆన్ లైన్ మనీ యాప్‌లపై నమోదు చేసిన కేసుల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేస్తోంది. ఇదివరకు ఫిన్‌టెక్ కంపెనీలకు చెందిన ఆస్తులు, బ్యాంక్ నిల్వలను అటాచ్ చేసింది. తాజాగా మరో రూ.19.39 కోట్ల ఆస్తులను, బ్యాంక్ ఖాతాల నిల్వలను అటాచ్ చేసింది. మనీ యాప్స్‌పై మనీ ల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. నిమిష ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ కోట్ ఇన్వెస్టిమెంట్స్, మహానంద ఇన్వెస్టిమెంట్స్, బస్కిన్ మేనెజ్ మెంట్ తదితర మనీ యాప్‌లపై కేసు ఫైల్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 118 కేసులు ఫైల్ అయ్యాయని ఈడీ అధికారులు వివరించారు.
ఇవి కూడా చదవండి...
Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్
CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 22 , 2024 | 08:49 PM