ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: స్వీపర్‌కు 2 లక్షల జీతం.. సంతకం పెడితే చాలు!

ABN, Publish Date - May 20 , 2024 | 04:12 AM

అతనో స్వీపర్‌.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ రీఫండ్‌ కోసం అతణ్ని డైరెక్టర్‌గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్‌సబాయ్‌, హౌస్‌కీపింగ్‌లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..!

  • పనిచేయకున్నా.. సంతకం పెడితే చాలు

  • రూ.46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత

  • ఈ-బైక్‌ పేరుతో ఏడు బోగస్‌ కంపెనీలు

  • డైరెక్టర్లంతా ఈ కోవకు చెందినవారే

  • పైసా ఖర్చు లేకుండా.. పత్రాలతోనే బురిడీ

  • దర్యాప్తులో నిగ్గుతేల్చిన సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): అతనో స్వీపర్‌.. ఆఫీసును శుభ్రపరచడమే పని..! కానీ పనిచేయకున్నా.. అడిగినప్పుడు సంతకాలు మాత్రం పెట్టి, నెలకు తీసుకునే జీతం రూ.2 లక్షలు..! కారణం.. జీఎస్టీ (GST) రీఫండ్‌ కోసం అతణ్ని డైరెక్టర్‌గా చూపించడమే..! అతనొక్కడే కాదు.. ఆఫీ్‌సబాయ్‌, హౌస్‌కీపింగ్‌లో పనిచేసే ఒకరిద్దరిని డైరెక్టర్లుగా పెట్టడం గమనార్హం..! ఈ నెల 4న వెలుగులోకి వచ్చిన రూ.46 కోట్ల జీఎస్టీ రీఫండ్‌ కుంభకోణంలో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఇలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణం వెనక ఢిల్లీకి చెందిన ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ చిరాగ్‌ శర్మ కీలక పాత్ర పోషించినట్లు సీసీఎస్‌ పోలీసులు నిగ్గుతేల్చారు. ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం జీఎస్టీలో 13ు రాయితీ ఇస్తుండడంతో.. తాను కన్సల్టెంట్‌గా సేవలందించిన కొందరు వ్యాపారులతో కుమ్మక్కై ఏడు బోగస్‌ కంపెనీలను సృష్టించాడు.


ఢిల్లీ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అవసరమైన ముడిసరుకులు కొనుగోలు చేసినట్లు ఇన్వాయి్‌సలు, అక్కడి నుంచి రవాణా చేసినట్లుగా ఈ-వేబిల్‌-1, 2లను సృ ష్టించి, జీఎస్టీ అధికారులను మేనేజ్‌ చేసుకుని, రీఫండ్‌ పేరుతో రూ.46 కోట్లను కొల్లగొట్టినట్లు సాంకేతిక ఆధారాలను సేకరించారు. జీఎస్టీ అధికారుల అండదండలు ఉండడంతో.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా.. రూ.46 కోట్లను రీఫండ్‌గా పొం దాడు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా జీఎ స్టీ అధికారులు కొందరు కమీషన్ల కక్కుర్తితో చిరాగ్‌ శర్మకు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందుకోసం జీఎస్టీ అధికారులు రూ.లక్షల్లో లంచం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎక్కడా క్షేత్రస్థాయిలో కంపెనీలను, తయారీ యూనిట్లను తనిఖీ చేయకుండా.. ఆన్‌లైన్‌లోనే పని చక్కబెట్టిన అధికారులు కూడా అందినంతా దండుకున్నారు.


నిందితులు వీరే..

చిరాగ్‌ శర్మ కీలక సూత్రధారిగా ఉన్న జీఎస్టీ రీఫండ్‌ కుంభకోణంలో మరో ఏడుగురు నిందితులున్నారు. వారిలో వేమారెడ్డి రాజారమేశ్‌రెడ్డి(వినర్త్‌ ఆటోమొబైల్స్‌) రూ.23.79కోట్లు, నీరజ్‌ శుక్లా(యూకో ఎలక్ట్రిక్‌ బైక్‌) రూ.8.47 కోట్లు, ఇందర్‌కుమార్‌(క్రాక్స్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌) రూ.63.06లక్షలు, గిరిధర్‌రెడ్డి, వినీల్‌ చౌదరి(గ్రోమోర్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌) రూ.2.87 కోట్లు, వీరిద్దరూ అపెక్స్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ పేరిట రూ.3.09 కోట్లు, సుప్రియాపాండే(సుప్రియా ఎలక్ట్రిక్స్‌) రూ.2.02 కోట్లు, గౌరవ్‌(మాగ్నమ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌) రూ.4.96 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్‌ పోలీసులు నిర్ధారించారు. పోలీసులు వీరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

Updated Date - May 20 , 2024 | 08:04 AM

Advertising
Advertising