ABN Live..: అసెంబ్లీ సమావేశాలు.. ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
ABN, Publish Date - Dec 20 , 2024 | 10:22 AM
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్ పై కేసు నమోదుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Winter Budget Sessions) ఆరవ రోజు (6th Day) శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈరోజు స్పీకర్ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. భూ భారతి 2024 బిల్లుపై చర్చ కొనసాగనుంది. అనంతరం సభ ఆమోదం తెలువనుంది. రైతు భరోసాపై లఘు చర్చ జరుగుతుంది.
ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదు: కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేస్‌పై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్ పై కేసు నమోదుతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ రేస్‌పై గత రాత్రి ఆయన స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీలో చర్చ చేపడితే సమాధానం ఇస్తామన్నారు. దీంతో ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఫార్ములా ఈ రేస్ కో ఫౌండర్ ఆల్బర్ట్ హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారని కేటీఆర్ అన్నారు. రేసుకు సంబంధించిన వాస్తవాలను సీఎం రేవంత్ రెడ్డి దాస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ఈరోజుతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శాసనమండలిలో..
శాసనమండలిలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సవరణ బిల్లును ప్రాతిపాదిస్తారు.. అలాగే సభ ముందుకు తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను ప్రతిపాదిస్తారు.. అలాగే రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల రైతుల నినాదాలు..
కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..
సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
సీఎం క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 20 , 2024 | 10:23 AM