Illegal A ssets Case: శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
ABN , Publish Date - Feb 07 , 2024 | 10:36 AM
హైదరాబాద్: హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శివ బాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్‌ను ఏసీబీ గుర్తించింది.
హైదరాబాద్: హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శివ బాలకృష్ణ బినామీల పేరుపై 150 ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్‌ను ఏసీబీ గుర్తించింది. సోదరుడు నవీన్ పేరుతో భారీగా భినామీ ఆస్తులు ఉన్నట్లు కనుగొంది. భరత్ కుమార్ అనే మరో బినామీ పేరుపై భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రెవిన్యూ డివిజన్స్‌లో హైరేస్ బిల్డింగ్లు, వందల కోట్ల విలువ చేసే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు శివ బాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెండింగ్‌లో ఉన్న వందకు పైగా ఫైల్స్‌ను క్లియర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో సోమ, మంగళవారం రెండు రోజులు వరుసగా సోదాలు నిర్వహించిన ఏసీబీ.. బుధవారం పలువురు బినామీలను, అనుమానితులను విచారించనుంది. మరోవైపు బుధవారంతో శివబాలకృష్ణ కస్టడి ముగియనుంది. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరు పర్చనున్నారు. మరో ఐదు రోజులపాటు అతణ్ని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
హెచ్ఎండిఏలో ముగిసిన ఏసీబీ సోదాలు
శివబాలకృష్ణ వ్యవహరంపై రెండు రోజుల పాటు హెచ్ఎండిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలు ముగిసాయి. శివబలకృష్ణ మూడేళ్ల పాటు హెచ్ఎండిఏ డైరెక్టర్‌గా పని చేశారు. శంషాబాద్, ఘట్కేసర్, శంకర్ పల్లి జోన్లలో 120 కు పైగా అనుమతులు జారీ చేసినట్టు గుర్తించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ డాక్యుమెంట్స్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. బాలకృష్ణ పలువురు మంత్రుల పేర్లు చెప్పి హెచ్ఎండిఏ అధికారులతో సంతకాలు చేయించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.