Hyderabad: కాల్పుల కలకలం.. ప్రేయసి తండ్రిపై తుపాకీతో రెచ్చిపోయిన యువకుడు..
ABN, Publish Date - Nov 10 , 2024 | 07:43 PM
సరూర్ నగర్ వేంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్-14లో రేవంత్ ఆనంద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె మన్విత, అంబర్పేట్‌కు చెందిన బల్విందర్ సింగ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియురాలిని ఆమె తండ్రి విదేశాలకు పంపించడంతో రెచ్చిపోయిన ప్రియుడు.. యువతి తండ్రిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అమ్మాయి తండ్రికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
సరూర్ నగర్ వేంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్-14లో రేవంత్ ఆనంద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె మన్విత, అంబర్పేట్‌కు చెందిన బల్విందర్ సింగ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసిపోయింది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో పెళ్లి చేయాలని వారు కోరారు. మన్విత, బల్విందర్ వివాహానికి యువతి తండ్రి రేవంత్ ఆనంద్ అడ్డుచెప్పారు. ఆమెను అతనితో కలవకుండా కట్టుదిట్టం చేశారు. అనంతరం కొన్ని రోజులకు ఎవ్వరికీ చెప్పకుండా కుమార్తె మన్వితను అమెరికా పంపించారు.
అయితే ప్రేయసిని కలవకుండా చేయడంతో కొన్ని రోజులుగా యువతి తండ్రి రేవంత్ ఆనంద్‌పై బల్విందర్ సింగ్ కోపంతో రగిపోతున్నాడు. ఇదే సమయంలో ప్రేయసిని అమెరికా పంపించినట్లు యువకుడికి సమాచారం అందింది. దీంతో తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తీసుకుని మన్విత ఇంటి వద్దకు యువకుడు చేరుకున్నాడు. అనంతరం అమెరికా ఎందుకు పంపించావంటూ ప్రశ్నించాడు. దీంతో తన కుమార్తె తన ఇష్టమని, ఆమెను ఎక్కడికైనా పంపించే హక్కు తనకు ఉందని ఆనంద్ చెప్పారు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో బల్విందర్ సింగ్‌కు కోసం నషాలానికి ఎక్కింది.
అంతే.. ఒక్కసారిగా రెచ్చిపోయిన యువకుడు తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి ఆనంద్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో బులెట్ అతని కంట్లోకి దూసుకెళ్లింది. కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు బల్విందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: ఉన్న వాటికే కాదు.. పాత వాటికీ పాతర వేశారు: కేటీఆర్..
Harish Rao: అందుకే మహారాష్ట్రాలో పోటీ చేయట్లేదు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి
Updated Date - Nov 10 , 2024 | 07:45 PM