ABN Effect: గాంధీలో నీటి కటకటకు తెర
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:37 PM
Telangana: రెండు రోజుల తర్వాత గాంధీలో తిరిగి నీటి సరఫరా ప్రారంభమైంది. రెండు రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోవడంతో రోగులు పడ్డ ఇక్కట్లపై ఏబీఎన్‌లో కథనం ప్రచురితమైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. మెయిన్ మోటర్‌ను మరమ్మత్తు చేయించడమే కాకుండా..
హైదరాబాద్, అక్టోబర్ 22: గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) నీటి కొరతపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో (ABN - Andhrajyothy) వచ్చిన కథనాలపై వైద్యశాఖ అధికారులు స్పందించారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మెయిన్ మోటర్‌ను అధికారులు మరమ్మత్తు చేయించారు. దీంతో రెండు రోజుల తర్వాత గాంధీలో తిరిగి నీటి సరఫరా ప్రారంభమైంది. రెండు రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోవడంతో రోగులు పడ్డ ఇక్కట్లపై ఏబీఎన్‌లో కథనం ప్రచురితమైంది. వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. మెయిన్ మోటర్‌ను మరమ్మత్తు చేయించడమే కాకుండా.. అత్యవసరమైతే జలమండలి వాటర్ ట్యాంకులను కూడా సిద్ధం చేశారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గత రెండు రోజులు నీటి సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచినీరు లేక పోవడంతో పాటు కాలకృత్యాలకు కూడా నీరు లేక రోగులు అవస్థలు పడ్డారు. చివరకు నీట సరఫరా లేకపోవడంతో శస్త్ర చికిత్సలు కూడా వాయిదా పడ్డ పరిస్థితి ఏర్పడింది. నీటి సరఫరా కొనసాగేవరకూ ఆపరేషన్లు జరగవని వైద్యులు స్పష్టం చేశారని రోగులు వాపోయారు. అలాగే మంచినీటిని బయట నుంచి తెప్పించుకు తమ దాహార్తిని తీర్చుకున్నారు. చిన్నపిల్లల వార్డుల్లో నాలుగు రోజుల నుంచి నీళ్లు రావడంలేదని చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేడియాలజీ విభాగం పక్కనే ఉన్న మంచినీటి కుళాయిలో నీళ్లు రాకపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు.
Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..
ఆస్పత్రి బయట ఉన్న దుకాణాల్లో మంచినీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి రావడంతో రోగులు, వారి సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రికి వచ్చే మినరల్ వాటర్‌ను మాత్రం డైట్ క్యాంటిన్‌కు తరలించారు. దీనిపై రోగుల సహాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. క్యాంటిన్‌కు పంపించిననట్లు ప్రతీ వార్డులో వాటర్ బాటిళ్లను సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు నీటి సరఫరా నిలిచిపోవడంతో గాంధీ ఆస్పత్రి సిబ్బంది అతిగా ప్రవర్తించారు. ఆస్పత్రిలోని అన్ని బాత్రూమ్‌లకు తాళాలు వేసేశారు. అదేమంటే నీరు రాకపోవడంతో రోగులు, వారి సహాయకులు అపరిశుభ్రం చేస్తారని సిబ్బంది చెప్పుకొచ్చారు. దీనిపై కూడా రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
బంగారం, వెండి ఆల్‌టైం రికార్డు
TG Ministers: సియోల్‌లో టీ.మంత్రులు బిజీబిజీ.. నేడు ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 22 , 2024 | 12:47 PM