Phone Tapping Case: నేటితో ముగియనున్న అడిషనల్ ఎస్పీల కస్టడీ
ABN, Publish Date - Apr 02 , 2024 | 08:39 AM
సాయంత్రం భుజంగ రావు, తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరు పరుచనున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబీ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి సారి రిటైర్డ్ ఐజి పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో అడిషనల్ ఎస్సీల కస్టడీ నేటితో ముగియనుంది. సాయంత్రం భుజంగ రావు, తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరు పరుచనున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబీ అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదటి సారి రిటైర్డ్ ఐజి పేరును రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. రిటైర్డ్ ఐజితో పాటు తిరుపతన్న, భుజంగ రావు, రాదాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణు గోపాల్ రావు కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు.
Kavitha: జైల్లో జపం చేసుకుంటా!
గతంలో ఎన్నికల సమయంలో డబ్బులు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాకిషన్ టీంలో పని చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఒక సస్పెండ్ అయిన ఇన్‌స్పెక్టర్‌ను త్వరలో పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ముగ్గురు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పోలీసులు సాక్ష్యులుగా చేర్చారు. ఎన్నికల సమయాల్లో ప్రణీత్ అండ్ కో ఇచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది డబ్బులు సీజ్ చేశారు. డబ్బులు సీజ్ చేసిన ఇన్‌స్పెక్టర్లతో పాటు ఎస్ఐ, కానిస్టేబుళ్లను పోలీసులు విచారించనున్నారు. త్వరలో రిటైర్డ్ ఐజి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నేడు రాధాకిషన్ కస్టడీపై నాంపల్లి కోర్టు విచారించనుంది. ప్రణీత్ రావ్ బెయిల్ పిటిషన్ పైనా నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
BJP.. కరీంనగర్: బండి సంజయ్ నేడు రైతు దీక్ష
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 02 , 2024 | 08:40 AM