MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. మళ్లీ టెన్షన్
ABN , Publish Date - Aug 05 , 2024 | 11:08 AM
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది..
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు పక్కనెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. సోమవారం నాడు డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను యిదా వేసింది. ఆగస్టు-07 కు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ కావేరి భవేజా స్పష్టం చేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో ఎల్లుండి ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్‌లో టెన్షన్ పెరిగిపోయింది.
ఇదివరకు ఇలా..!
కాగా.. కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జూలై- 22న విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారానికి(ఆగస్టు-05) వాయిదా వేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారిన ఈ పరిస్థితుల్లో మరోసారి విచారణ వాయిదా పడింది.
విశ్వప్రయత్నాలు..!
ఇదిలా ఉంటే.. తిహాడ్ జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు ఇవాళ కలిసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత అరెస్ట్ అయ్యింది మొదలుకుని నేటి వరకూ బెయిల్ కోసం ఈ ఇద్దరూ విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు రౌస్ అవెన్యూ కోర్టులో.. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం ఆపట్లేదు. అయితే.. ప్రతిసారీ కోర్టులో వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. కాగా.. తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు కేటీఆర్, హరీశ్‌రావులు శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసి సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అనే దానిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదేదో తేలితే.. ఢిల్లీ నుంచి నేరుగా తీహాడ్ జైలుకు వెళ్లి కవితతో భేటీ కావాలని మాజీ మంత్రులు ఇద్దరూ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.