Adluri Laxman:కేటీఆర్, హరీశ్‌రావు మధ్య ఆ పంచాయతీ నడుస్తోంది
ABN, Publish Date - Feb 26 , 2024 | 07:29 PM
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తామంటే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను పదేళ్లలో అమలు చేయలేని బీఆర్ఎస్ నేతలకు తమను విమర్శించే అర్హత లేదని చెప్పారు. కల్వకుంట్ల కుటంబ అహాంకారానికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మధ్య సీటు పంచాయతీ జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే వంద సీట్లు వచ్చేవని లక్ష్మణ్ చెప్పారు.
Updated Date - Feb 26 , 2024 | 07:30 PM