Allu Arjun: భరించలేకపోతున్నా.. సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్..
ABN, Publish Date - Dec 21 , 2024 | 08:32 PM
Allu Arjun Press Meet: రేవతి మృతి ఘటన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై హీరో అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. శనివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్..
Allu Arjun Press Meet: రేవతి మృతి ఘటన నేపథ్యంలో చెలరేగిన వివాదంపై హీరో అల్లు అర్జున్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. శనివారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరడాన్ని భరించలేకపోతున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులను పరామర్శించేందుకు ఎంతో దూరం వెళ్లానని.. అలాంటిది తన అభిమానులు గాయపడితే తాను ఎంత బాధపడతా? అని అన్నారు. తొక్కిసలాట ఘటన మరుసటి రోజు వరకు తనకు తెలీదన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనుకున్నానని చెప్పారు. కానీ, అక్కడికి రావొద్దని పోలీసులు సూచించారని అల్లు అర్జున్ చెప్పారు. శ్రీతేజ్ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసి తన మనుషులను అక్కడికి పంపించానన్నారు. ఈ బాధలో తాను సక్సెస్ మీట్‌ను కూడా రద్దు చేసుకున్నామని అల్లు అర్జున్ చెప్పారు. సీఎం వ్యాఖ్యలు బాధించాయన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 09:07 PM