Rajasingh: చంద్రబాబు నాయుడు నాకు రాజకీయ గురువు
ABN, Publish Date - Aug 07 , 2024 | 01:32 PM
Telangana: ఏపీలో పురాతన దేవాలయాలను, ఎండోమెంట్ భూములను కాపాడాలని ఈనెల 6న సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. లేఖపై ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 7: ఏపీలో పురాతన దేవాలయాలను, ఎండోమెంట్ భూములను కాపాడాలని ఈనెల 6న సీఎం చంద్రబాబు నాయుడుకు (AP CM Chandrababu Naidu) లేఖ రాశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasing) తెలిపారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. లేఖపై ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువన్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో వేల ఎకరాల దేవాదాయ భూములు, ఆలయాలు అన్యాక్రాంతం అయ్యాయన్నారు.
Pawan Kalyan: సమస్యలపై డిప్యూటీ సీఎంకు మెురపెట్టుకున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు..
తాను రెగ్యులర్‌గా తిరుపతి , శ్రీశైలం వెళ్తానన్నారు. ఇప్పటికి శ్రీశైలంలో ఇతర మతస్తులు వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. గతంలో శ్రీశైలం దేవస్థానానికి పూలు సరఫరా చేస్తున్న సమయంలో మద్యం, మాంసం దొరికిందన్నారు. దీనిపైన కేసులు అయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో 90 వేల ఎకరాల ఎండోమెంట్ భూములు ఉన్నాయన్నారు.
Bithiri sathi: భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కైన బిత్తిరి సత్తి
ఇందులో చాలా వరకు టీఆర్‌ఎస్ హయాంలో అక్రమాలకు గురయ్యాయని చెప్పారు. దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం అమెరికా పర్యటన నుంచి రాగానే దీనిపై లేఖ రాస్తానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ ధర్మాదాయ భూములు, పురాతన దేవాలయాల పరిరక్షణపై త్వరలో తమ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Tummala: ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. కారణమిదే!
TS News: ప్రేమజంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్ అరెస్ట్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2024 | 01:44 PM