Share News

Crime: శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

ABN , Publish Date - Aug 14 , 2024 | 08:30 AM

హైదరాబాద్: శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చడంతో యువకుడు గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం చేయించాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో బాలిక తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నం చేశాడు.

Crime: శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం...

హైదరాబాద్: శంషాబాద్ (Shamshabad) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చడంతో యువకుడు (Youth) గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం (Miscarriage) చేయించాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో బాలిక తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నం చేశాడు. బాలిక శీలానికి వెలకట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు డబ్బుకు లొంగ కుండా పోలీసులను ఆశ్రయించారు. నిందితుడుపై శంషాబాద్ పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


బాధిత బాలిక తన తండ్రితో పాటు నిందితుడి వ్యవసాయ క్షేత్రంలోకి పనికి వెళుతుండేది. బాలికపై కన్నేసిన నిందితుడు ఆమెను బెదిరించి.. భయపెట్టి లొంగదీసుకుని పలుమార్లు హత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆమె శరీరంలో మార్పులు రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో జరిగిన ఘోరం తండ్రికి చెప్పింది. బాలిక ప్రాణానికి ముప్పు అని తెలిసి కూడా నిందితుడు ఐదో నెలలో గర్భస్రావం చేయించాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తి గొంతు కోసి పరారయ్యాడు. పరారైన వ్యక్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..


బార్బర్ వృత్తి చేసుకునే ఇద్దరు నార్సింగ్‌లోని పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ రావడంతో రాజు (50) అనే బార్బర్‌ను మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్లు ప్రాధిమిక సమాచారం. హత్య చేసిన వ్యక్తి రాజు బంధువుగా పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..

ఇదో అగ్లీ దందా!

మళ్లీ చంద్రన్న కానుకలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 14 , 2024 | 10:29 AM