Hyderabad: హైదరాబాద్‌లో వెలుగుచూసిన భారీ అవినీతి..
ABN, Publish Date - Jun 13 , 2024 | 09:55 AM
బల్దియా పరిధిలో భారీ అవినీతి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్ల స్కామ్ బట్టబయలైంది. అవును, ఈ అవినీతి అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు నిర్ధారించారు అధికారులు. జీహెచ్ఎంసీలో లేని కార్మికులకు రూ. 200 కోట్ల వేతనాలు చెల్లించారు అధికారులు. గత పదేళ్లుగా ఇదేతంతు జరిగిందని..
హైదరాబాద్, జూన్ 13: బల్దియా పరిధిలో భారీ అవినీతి బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 200 కోట్ల స్కామ్ బట్టబయలైంది. అవును, ఈ అవినీతి అంతా గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు నిర్ధారించారు అధికారులు. జీహెచ్ఎంసీలో లేని కార్మికులకు రూ. 200 కోట్ల వేతనాలు చెల్లించారు అధికారులు. గత పదేళ్లుగా ఇదేతంతు జరిగిందని.. బల్దియా నిధులన్నీ పక్కదారి పట్టాయని తాజాగా అధికారులు గుర్తించారు. పారిశుద్ధ కార్మికుల పేస్ రికగ్నిషన్‌తో బోగస్ కార్మికులను గుర్తించారు అధికారులు. తాజాగా జీహెచ్ఎంసీలో 1,570 మంది బోగస్ కార్మికులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అంతేకాదు.. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలోనూ 20 శాతం మంది విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు.
గ్రేటర్ పరిధిలో ఎంత మంది కార్మికులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో ఇటీవల 16,987 మంది కార్మికులు ఫేస్ రికగ్నిషన్ చేసుకున్నారు. వీరిలోనూ నిత్యం విధులకు హాజరవుతున్నది 12 వేల మంది లోపే ఉన్నారు. సింథటిక్ వేలిముద్రలతో మరణించిన కార్మికుల పేరుతో ఎస్ఎఫ్‌ఏలు జీతాలు తీసుకున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్‌తో ఈ అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతినెల జీహెచ్ఎంసీకి రూ. 2.5 కోట్లు మిగలనుంది.
For More Telangana News and Telugu News..
Updated Date - Jun 13 , 2024 | 10:02 AM