ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

ABN, Publish Date - Mar 24 , 2024 | 10:26 AM

హైదరాబాద్: రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు.

హైదరాబాద్: రానున్న లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో (Elections) తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీ (PM Modi)కి గిఫ్ట్ (Gift) ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ (BJP) దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలు సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన పార్టీ లోక్‌సభ అభ్యర్థుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీజేపీ నేతలు లక్ష్మణ్ (Lakshman), డీకే అరుణ (DK Aruna), బండి సంజయ్ (Bandi Sanjay), సునీల్ బన్సల్ (Sunil Bansal), తరుణ్ చుగ్ (Tarun Chugh), లోక్‌సభకు పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులు.. తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార వ్యూహాంపై నేతలు చర్చించనున్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలో కనీసం పది స్థానాలను గెలవాలని తెలంగాణ బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలో కనీసం పది స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.

Updated Date - Mar 24 , 2024 | 11:17 AM

Advertising
Advertising