TS News: ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీకి బీజేపీ నేత ఫిర్యాదు
ABN, Publish Date - Apr 02 , 2024 | 04:18 PM
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీకి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు అక్రమ ఆస్థులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: ఫోన్ ట్యాపింగ్ కేసుకు (Phone Tapping Case) సంబంధించి రాష్ట్ర డీజీపీకి బీజేపీ నేత చికోటి ప్రవీణ్ (BJP Leader Chikoti Praveen) ఫిర్యాదు చేశారు. సీబీఐ (CBI) చేత దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు అక్రమ ఆస్థులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాధకిషన్ అక్రమ ఆస్తులపై ఈడీకి లేఖ రాస్తానన్నారు. సినిమా హీరోయిన్లు, వ్యాపార వేత్తల ఫోన్స్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు దిగారన్నారు.
AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?
మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు నేరుగా ఫోన్ చేసి.. సీఎం నియోజకవర్గానికి వెలితే పీడీ యాక్ట్ నమోదు చేస్తానని బెదిరింపులు దిగారని అన్నారు. కేసులు పెట్టకుండా ఉండాలంటే భారీ స్థాయిలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆయుధాల కేసు నమోదు చేసి వేధించారన్నారు. ఫామ్ హౌస్‌పై దాడి చేస్తానని బెదిరించారన్నారు. డబ్బులు ఇవ్వక పోవడంతో డ్రగ్స్, గంజాయి కేసు పెడుతానంటూ బెదరింపులకు గురిచేశారని తెలిపారు. రాధ కిషన్ రావుపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. రాధ కిషన్ రావు బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని.. బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చికోటి ప్రవీణ్ భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 02 , 2024 | 04:34 PM