ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Etela: ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు.. రేవంత్‌పై ఈటెల ఫైర్

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:21 PM

Telangana: ‘‘మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు’’ అంటూ ఎంపీ ఈటెల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.

BJP MP Etela Rajender

హైదరాబాద్, అక్టోబర్ 1: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) నిరంతర దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా మాల్కజ్‌గిరి ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. ‘‘మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు’’ అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తాట తీసే శక్తి ప్రజలకు, రైతులకు ఉంటుందన్నారు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ‘‘మీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే మీ గౌరవం పోతుంది’’ మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితవుపలికారు.

Sarpanch Elections: సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త


ప్రభుత్వం ఇస్తా అన్న 2 లక్షల రూపాయలు రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెడతారన్నారు. రెండు మూడు రోజుల్లో రింగ్ రోడ్డు వద్ద ధర్నా చేస్తామన్నారు. సాక్షాత్తు హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేసిందని.. అవి వేసింది హైడ్రాపై కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టు వ్యాఖ్యలతో అయినా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న. ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం’’ అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు..


కాంగ్రెస్‌ టార్గెట్ హిందువులే: ధర్మపురి

మరోవైపు బీజేపీ నేతల దీక్షకు ఆపార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం ఇందరాపార్క్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితపై హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ దీక్షకు కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. దీక్షపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారని... ఆయనకు వయసు మీద పడిందంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాంతీయ పంటలను విస్మరించారని.. ఇప్పుడు రేవంత్ అదే ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. హైడ్రాపై హైకోర్ట్ మొట్టి కాయలు వేసిందన్నారు. ‘‘ముస్లింల ఇండ్లను ముట్టుకోలేదు. చుట్టాలను ముట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలను ముట్టుకోలేదు.

MLA: అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం..


కాంగ్రెస్ టార్గెట్ అంతా హిందువులే’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరుంచడం , బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ నైజమన్నారు. 22 పంటలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయం చేశారన్నారు. గుజరాత్ ఆదాయం మోదీ హయాంలో ఎంత పెరిగిందో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పైసలు ఎలా సంపాదించాలి అనే ద్యాసనే ఉందంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్‌లు చేసి జైళ్లల్లోకి వెళ్లారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని.. వచ్చే ఎన్నికల్లో ఉంటాడో పీకుతాడో తెలియదంటూ కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవితల మోసం చూసి ఎవ్వరూ కూడా ఓటు వేయరన్నారు. ‘‘మొన్నటి వరకు ముసలోడు కేసీఆర్ ఉండే ఇప్పుడు ఆయన వయస్సు 74. ఇక ఇతనితో ఏం కాదు’’ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Hydra: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ

Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 12:23 PM