ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..!?

ABN, Publish Date - Jul 23 , 2024 | 08:16 PM

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత అరెస్ట్ (Kavitha Arrest) అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో కవిత ఉన్నారు...

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత అరెస్ట్ (Kavitha Arrest) అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో కవిత ఉన్నారు. ఆమెను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి బెయిల్ కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే.. కవిత అరెస్టుపై ఇంతవరకూ బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే మీడియా ముందుకు రావడం, ఢిల్లీకెళ్లి బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మాత్రం ఇంతవరకూ నేరుగా స్పందించిన దాఖలాల్లేవ్. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో తొలిసారి గులాబీ బాస్ స్పందించి భావోద్వేగానికి లోనయ్యారు.


రాజకీయ కక్షతోనే..!

నేను అగ్ని పర్వతంలా ఉన్నాను. రాజకీయ కక్షతోనే నా కూతురు కవితను జైళ్లో పెట్టారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా..?. ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొందాం. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక బీజేపీ ప్రభుత్వం ఆడుతోన్న నాటకమే ఇదంతా. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులా మారాయి. బీర్ఎస్‌లో ఇప్పుడేమీ క్లిష్ట పరిస్థితులు లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాంఅని ఎమ్మెల్యేలతో చెబుతూ కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. కవిత తప్పు చేశారు కాబట్టే కేసీఆర్ స్పందించటం లేదని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో కవిత అరెస్టుపై కేసీఆర్ స్పందించారు.


ఇక మొదలుపెడదాం..!

ఇక ఇదే సమావేశంలో బీఆర్ఎస్‌ పదేళ్ల పాలన, రేవంత్ ఏడు నెలల పాలనపై కూడా కేసీఆర్ స్పందించారు. అంతేకాదు.. ఎందుకింత వ్యతిరేకత వచ్చిందనే దానిపై గులాబీ బాస్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదేళ్ల తర్వాత వ్యతిరేక వచ్చింది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలకే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది.కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీద్దాంఅని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు కేసీఆర్ సూచించారు. కాగా.. మాజీ సీఎం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. గులాబీ బాస్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సభలో ఏయే విషయాలు ప్రస్తావించాలి..? ఎలా వ్యవహరించాలి..? అనేదానిపై సభ్యులకు.. కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో, బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.

అసెంబ్లీకి కేసీఆర్.. ఏం చేయబోతున్నారు..!?

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Jul 23 , 2024 | 08:27 PM

Advertising
Advertising
<